Site icon HashtagU Telugu

Cardamom: యాలకులతో ఈ విధంగా చేస్తే చాలు ఆర్థిక నష్టాలు పోవడం గ్యారెంటీ!

Cardamom (2)

Cardamom (2)

మన చుట్టూ ఉన్న వారిలో ప్రతి పదిమందిలో ఎనిమిది మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. రాత్రి పగలు కష్టపడి సంపాదించినప్పటికీ చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలడం లేదని ఇబ్బంది పడుతున్న వారు బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు. ఇక ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడం కోసం చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అయినా కూడా ఆర్థిక సమస్యలు తీరడం లేదని బాధపడుతూ ఉంటారు. అయితే అలాంటి వారి కోసం వాస్తు శాస్త్ర నిపుణులు ఒక చక్కటి పరిష్కారాన్ని తీసుకువచ్చారు.

ఇంతకీ ఆ పరిష్కారం ఏమిటి? ఏం చేస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆర్థిక సమస్యలను దూరం చేయడంలో యాలకులు ఎంతో బాగా ఉపయోగపడతాయట. ప్రతీ ఒక్కరి ఇంట్లో యాలకులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. వీటితోనే మనం ఇంట్లో ఉండే డబ్బు పరమైన చిక్కులను తగ్గించుకోవచ్చట. యాలకులు దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు చాలా వరకు దూరం అవుతాయట. పేదవారికి అంటే ఏమీ లేని వారికి లేదా హిజ్రాలకు అయినా యాలకులతో పాటు కొద్దిగా ధనం దానం చేస్తే చాలా మంచిదని చెబుతున్నారు.

దీని వల్ల మీ సమస్యలు తీరి ఆనందంగా ఉంటారట. మీరు ఎక్కడికి వెళ్లినా మీతో పాటు పర్సు కూడా ఉంటుంది. మీ వెంట తీసుకెళ్లే పర్సు లేదంటే మీ డబ్బులు ఉంచే చోట ఒక ఐదు యాలకులను ఉంచాలి. ఇలా పెట్టడం వల్ల కూడా ఆర్థిక సమస్యలు తగ్గుతాయట. కుటుంబంలో గొడవలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు. అలాగే ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారు పడుకునే ముందు ఒక యాలిక్కను ఒక ఆకు పచ్చ వస్త్రం లో చుట్టి మీరు నిద్రించే దిండు కింద పెట్టుకోవాలి. ఆ తర్వాత రోజు దీన్ని ఎవరికైనా ఇవ్వడం వల్ల మీరు అనుకున్న కళ నెరవేరడంతో పాటు మీకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.