మామూలుగా మనం బంగారం వెండి అలాగే వజ్రాలతో తయారు చేసిన ఆభరణాలు ధరిస్తూ ఉంటాం. ఎక్కువ శాతం మంది బంగారం వెండి ఆభరణాలనే ఉపయోగిస్తూ ఉంటారు. వెండి ఉంగరాలు వెండి పట్టీలు వెండి దండలు, వెండి బ్రాస్లెట్ కడియం వంటి రకరకాల ఆభరణాలను ధరిస్తూ ఉంటారు. అయితే వాస్తవానికి జ్యోతిష్య శాస్త్రంలో వెండిని ధరించడం అన్నది మంగళకరమైనదిగా పరిగణించబడుతుంది. వెండి చంద్రునికి సంబంధించినది. ఇది మనసు భాగో ద్వేగాలకు కారకం లోహంగా పరిగణించబడుతుందని చెబుతున్నారు. వెండిని ధరించడం వల్ల చంద్రునికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయట.
కొంతమంది వెండి ఆభరణాలు ధరించడం మంచిది కడతానుఅటువంటి పరిస్థితిలో ఏ వ్యక్తులు వెండిని ధరించకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వెండి ఆభరణాలు ధరించడం వల్ల జాతకంలో ఉండే చంద్ర దోషం సమస్యలు పరిష్కారం అవుతాయట. అయితే కొంత మంది వెండి ఆభరణాలు ధరించడం వలన మంచి కంటే నష్టాలు కూడా ఉన్నాయి. వెండిని ధరించడం వల్ల గ్రహాలు, నక్షత్రాల పరిస్థితి మరింత దిగజారుతుందట. కొంతమంది వెండిని ధరించడం వల్ల కొన్ని గ్రహాలు, రాశుల పరిస్థితి మరింత దిగజారిపోతుందని పండితులు చెబుతున్నారు. అప్పుడు ప్రయోజనాలకు బదులుగా, వెండి ఆభరణాలు ధరించడం వల్ల నష్టాలు మొదలవుతాయట.
అటువంటి పరిస్థితిలో కొంతమంది వెండి ఆభరణాలు ధరించడం పూర్తిగా మానుకోవడం మంచిదని చెబుతున్నారు. కొందరు వ్యక్తులు చాలా భావోద్వేగంగా ఉంటారు లేదా చాలా కోపంగా ఉంటారు. అలాంటి వారు వెండి ఆభరణాలు ధరించకూడదట. అలాంటి వారు వెండి ఆభరణాలు ధరిస్తే వారిలో భావోద్వేగాలు, కోపం రెండు మరింత పెరుగుతాయట. చంద్రుని దృష్టిలో ఉంచుకుని వెండి ఆభరణాలు ధరిస్తారు. ఎవరి జాతకంలో చంద్రుడు 12వ లేదా 10వ ఇంట్లో ఉంటాడో వారు వెండి ఆభరణాలు ధరించడం మానుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.