Site icon HashtagU Telugu

Garuda Puranam : ఆ చిన్న చిన్న పొరపాటులే దురదృష్టం, దరిద్రానికి కారణం అన్న విషయం మీకు తెలుసా?

Garuda Puranam

Garuda Puranam

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే మనం అనుభవించే దురదృష్టం, దారిద్య్రానికి కారణం అన్న విషయం చాలా మందికి తెలియదు. మన ఆలోచనలు మన మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక వ్యక్తి అలాంటి తప్పులు చేసినప్పుడు, అతను పేదరికం, దురదృష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు కూడా ఈ తప్పులు చేస్తుంటే ఖచ్చితంగా పేదరికంలో మునిగిపోతారు. మరి ఎటువంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇతరుల భూమి లేదా సంపదను బలవంతంగా లాక్కోవడం మహాపాపం. ఇలాంటి తప్పులు చేసేవారు జీవితంలో ఆనందాన్ని అనుభవించలేరు.

లక్ష్మీదేవి వారిపై కోపగించుకుంటుంది. అంతేకాకుండా పేదలను లేదా నిస్సహాయులను దోపిడీ చేసి డబ్బు సంపాదించే వారి ఆస్తి చాలా త్వరగా నాశనం అవుతుంది. అలాంటివారు ఎంత ధనవంతులైనా వారిని క్రమంగా పేదరికం ఆవహిస్తుంది. శుభ్రత లేని వారి ఇళ్లలో లక్ష్మీదేవి నివసించదని గరుడ పురాణంలో చెప్పారు. అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఉదయాన్నే భగవంతుడిని పూజించే ముందు స్నానం చేసి శుద్ధి చేసుకోవాలి. రాత్రి పూట భోజనం చేసి పడుకునే ముందు పాత్రలు, వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. తిన్న పాత్రలను తోమ‌కుండా ఉంచడం వల్ల ఇంట్లోని వ్య‌క్త‌ల‌ను దురదృష్టం వెంటాడుతుంది.

లక్ష్మీదేవి కోపానికి కూడా ఇదే కారణమని గరుడ పురాణం చెబుతోంది. అలాగే మితిమీరిన కోపం ఉన్న వ్యక్తి జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండదు. ప్రతి విషయంలోనూ అరిచే వారు భార్యాపిల్లలపై ఎప్పుడూ కోపంగానే ఉంటారు. ఆ వ్యక్తి ప్రవర్తనే అతని ఇంటి పేదరికానికి ప్రధాన కారణం. చాలా మందికి ఎప్పుడూ పళ్లు కొరక‌డం, గోళ్లు కొరికే చెడు అలవాటు ఉంటుంది. మీకు అలాంటి అలవాట్లు ఉంటే వెంటనే మానేయండి. ఇలాంటి అలవాటు వల్ల జీవితంలో అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ పేదరికానికి కూడా దారితీయవచ్చు. చాలామందికి ఉండే అతి చెడ్డ అలవాటు ఏమిటంటే కాళ్లు ఈడుస్తూ నడవడం. అలా అస్సలు చేయకూడదు. మనం తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లే మన దారిద్య్రానికి ఆర్థిక సమస్యలకు కారణం అవ్వచ్చు.