Garuda Purana: చనిపోయిన వ్యక్తికి సంబంధించి ఆ మూడు వస్తువులను వాడుతున్నారా.. అయితే అంతే సంగతులు?

మామూలుగా చాలామంది వారికి ఇష్టమైన వారు చనిపోతే వారికి సంబంధించిన వస్తువులను వారి దగ్గర అలాగే పెట్టుకుంటూ ఉంటారు. వారి వస్తువులను జ్ఞాప‌కంగా,

  • Written By:
  • Publish Date - December 28, 2023 / 06:12 PM IST

మామూలుగా చాలామంది వారికి ఇష్టమైన వారు చనిపోతే వారికి సంబంధించిన వస్తువులను వారి దగ్గర అలాగే పెట్టుకుంటూ ఉంటారు. వారి వస్తువులను జ్ఞాప‌కంగా, గుర్తుగా ఉపయోగిస్తారు, అయితే కొందరు మరణించిన వారి వస్తువులను నాశనం చేస్తారు. మృతి చెందిన వారి వస్తువులు వినియోగించడం మంచిదే కానీ పొరపాటున కూడా వారికి సంబంధించిన వ‌స్తువుల‌ను మనం తప్పుగా ఉపయోగించకూడదు. ఇది చనిపోయిన వారి ఆత్మను ఆకర్షిస్తుందని, ఫ‌లితంగా ఇంట్లో ప్రతికూలతను వ్యాప్తి చేస్తుందని నమ్ముతారు. మరి ఎలాంటి వస్తువులను తప్పుగా వినియోగించకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రతి వ్యక్తికి తాను ధ‌రించే ఆభరణాల పట్ల ఎంతో అనుబంధం ఉంటుంది. ఇది చనిపోయిన వ్యక్తి ఆత్మకు కూడా వర్తిస్తుంది. గరుడ పురాణం ప్రకారం, మరణించిన వ్యక్తికి సంబంధించిన‌ నగలు ధరించకూడదు. వాటిని ధ‌రిస్తే మరణించిన వ్యక్తి శక్తి లేదా ఆత్మ అతని ఆభరణాలను ధరించిన వ్యక్తిని ఆవ‌హిస్తుంది. అలా జ‌ర‌గ‌కూడ‌ద‌నుకుంటే ఏం చేయాలో కూడా గ‌రుడ పురాణంలో సూచించారు. మీరు వారి ఆభరణాలను ఉపయోగించాలనుకుంటే, ఆ నగలను క‌రిగించి, వాటితో కొత్త న‌గ‌లు చేయించుకుని ధరించడం మంచిది. కొత్త నగలను తయారు చేయించుకుని మీరు ఉపయోగించవచ్చు. అలాగే మరణించిన వ్యక్తి తన మరణానికి ముందు తన ఆభరణాలను మీకు బహుమతిగా ఇస్తే, మీరు దానిని ఉపయోగించుకోవచ్చు. వాటిని పవిత్రంగా ఉంచవచ్చు. అలా కాకుండా మరణించిన వ్యక్తి వాడిన ఆభరణాలను ధరించి తప్పు చేయవద్దు.

దుస్తులు.. అలాగే ఒక వ్యక్తి ఆభరణాల కంటే ఎక్కువగా ఇష్టపడేవి ఏవైనా ఉన్నాయి అంటే అవి దుస్తులు మాత్రమే. మరణించిన తర్వాత కూడా, మరణించిన వ్యక్తి ఆత్మ ప్రాపంచిక అనుబంధాన్ని విడిచిపెట్టదు. అటువంటి పరిస్థితిలో, మీరు వారి దుస్తులను ధరించడం వ‌ల్ల‌ వారి ఆత్మను ఆకర్షించవచ్చు. అందుకే చనిపోయిన వారి దుస్తులు ధరించడం మానుకోవాలి. ఒక వ్యక్తి మరణించిన తరువాత అతని వస్త్రాలు దానం చేయాలి. అలా చేయ‌డం వల్ల చ‌నిపోయిన వ్య‌క్తి ఆత్మకు శాంతిని, మోక్షాన్ని ఇస్తుంది.

చేతి గడియారం.. కుటుంబ సభ్యుల మరణం తరువాత, వారి చేతి గడియారాన్ని కూడా ఉపయోగించకూడదు. చనిపోయినవారి సానుకూల, ప్రతికూల శక్తి వాచ్‌లో నివసిస్తుందని నమ్ముతారు. చనిపోయిన వారి చేతి గడియారాన్ని ధరించిన వ్యక్తి ప్రతికూల శక్తితో ప్రభావితమవుతాడు. ఫ‌లితంగా అతను చనిపోయిన వారి గురించి మళ్లీ మళ్లీ కలలు కంటాడు. ఈ కారణాల వల్ల మనం చనిపోయిన వ్యక్తి చేతి గడియారాన్ని ఉపయోగించకూడదు.