హైదరాబాద్లో (Hyderabad) గణపతి నిమజ్జనాలు (Ganesh Immersion) ప్రశాంతంగా ముగిసినట్లు GHMC ప్రకటించింది. గణేష్ ఉత్సవాలు అంటే హైదరాబాద్ తర్వాతే..దేశంలో ఎక్కడలేని విధంగా హైదరాబాద్ మహానగరంలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా నగర వ్యాప్తంగా ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు జరిగాయి. నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథులు..రెండు రోజులుగా తల్లిఒడిలోకి చేరారు. నవరాత్రులు పూజలందుకున్నబొజ్జగణేశుడిని గంగాదీశున్ని చేసేంత వరకు యువత డీజే చప్పుళ్లకు స్టెప్పులేస్తూ ఆధ్యంతం ఉత్సాహంగా సాగింది.
ఓ పక్క నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుండగా పారిశుద్ధ్య కార్మికులు రోడ్లపై చెత్తను ఎప్పటికప్పుడు తొలగించే ప్రక్రియను ముమ్మరం చేశారు. ట్యాంక్ బండ్, లిబర్టీ, హిమాయత్ నగర్, బషీర్ బాగ్ ప్రాంతాల్లో రహదారులను శుభ్రం చేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. నిమజ్జన వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయవంతం చేసినందుకు అధికారులు, సిబ్బందికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, మేయర్ విజయలక్ష్మి ధన్యవాదములు తెలిపారు.
నగర వ్యాప్తంగా మొత్తం 1,25,111 విగ్రహాల నిమజ్జనం జరగ్గా, అత్య ధికంగా IDL చెరువులో 28,946, ట్యాంక్ బండ్ NTR మార్గ్-5730, నెక్లెస్ రోడ్ -2360, పీపుల్స్ ప్లాజా-5720, రాజేంద్రనగర్-11,548, అల్వాల్ కొత్తచెరువు-6,572, ముషీరాబాద్లో 7,457 విగ్రహాలు గంగమ్మ ఒడిని చేరినట్లు GHMC వెల్లడించింది. ఖైరతాబాద్ బడా గణేష్ మొన్ననే నిమ్మజ్జనం కాగా మిగతా విగ్రహాలన్నీ నిన్న నిమజ్జనం అయ్యాయి.
Read Also : Diabetes: షుగర్ వ్యాధి గ్రస్తులు ఉదయాన్నే వీటిని తాగితే కలిగే ప్రయోజనాలు ఎన్నో?