ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినాయక చవితి సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. నేటికీ వినాయక చవితి పండుగ మొదలై మూడు రోజులు అయింది. ఇంకా ఏడు రోజులపాటు ఈ వినాయక చవితి వేడుకలు జరగనున్నాయి. చిన్న చిన్న విగ్రహాల సంగతి పక్కన పెడితే భారీ విగ్రహాలు ముఖ్యంగా ముంబై హైదరాబాదు లాంటి ప్రదేశాలలో అయితే ఏకంగా 11 రోజుల పాటు పూజించి ఆ తర్వాత గణేష్ నిమజ్జనం చేస్తూ ఉంటారు. అయితే విఘ్నేశ్వరుని ప్రతిష్టించిన తర్వాత నిమజ్జనం చేయడం అన్నది సర్వసాధారణం. కొందరు మూడు రోజులకు చేస్తే మరి కొందరు ఐదు రోజులకు మరికొందరు ఏడు రోజులకు ఇంకొంత మంది 11 రోజులకు నిమజ్జనం చేస్తుంటారు.
ఎక్కువ శాతం 3, 5, 11 రోజులకే గణేష్ నిమజ్జనం చేస్తూ ఉంటారు. గణేష్ ని నీటిలోని నిమజ్జనం చేయాలని పండితులు చెబుతుంటారు. నిమజ్జనం చేయడం మంచిదే కానీ నిమజ్జనానికి ముందు కొన్ని రకాల పనులు తప్పకుండా చేయాలట. ముఖ్యంగా గణేష్ నిమజ్జనానికి ముందు పూజ తప్పనిసరిగా చేయాలని పండితులు చెబుతున్నారు. మరి నిమజ్జనానికి ముందు ఎలాంటి పూజ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. విఘ్నేశ్వరుడిని నిమజ్జనం చేసే ముందు పూజించాలట. గణపతికి ఎర్రచందనం, ఎర్రపూలు, దుర్వ, మోతీచూర్ లడ్డూలు లేదా బేశన్ లడ్డూలు, తమలపాకులు, వక్కలు, అగరబత్తులు మొదలైన వాటిని సమర్పించాలట. ఆ తర్వాత కుటుంబ సమేతంగా గణపతికి హారతి ఇవ్వాలట. వీలైతే, హవాన్ చేయాలని చెబుతున్నారు.
దీని తరువాత, లడ్డూలు దక్షిణను గణేశుడికి ఇవ్వాలట. ఈ రోజున గణపతి తన ఇంటికి తిరిగి వస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకే విఘ్నేశ్వరుని నిమజ్జనానికి పంపేముందు ఒట్టి చేతులతో పంపకూడదట. అతన్ని ఖాళీ చేతులతో పంపరు. దీని తరువాత గణేశునికి క్షమాపణ చెబుతూ నిమజ్జనం చేసే ముందు కుటుంబ శ్రేయస్సుల కోసం ప్రార్థించాలట. ఆ తర్వాత పూల వర్షం అలాగే ఎరుపు రంగులతో సంతోషంగా గణేష్ నిమజ్జనానికి తీసుకెళ్లి గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేయాలని పండితులు చెబుతున్నారు.