Ganesh Immersion : ట్యాంక్‌బండ్ (Tank Bund) పై రెండో రోజు గణనాథుల నిమజ్జనం (Ganesh Immersion) కొనసాగుతూనే ఉంది. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం గణనాథులు నిమజ్జనానికి క్యూ కట్టాయి. దీంతో ఎక్కడిక్కడే ట్రాఫిక్ జాం అయ్యింది. నవరాత్రులు విశేష పూజలు అందుకున్న తల్లిఒడికి చేరుతున్నారు. నిన్న ఉదయం నుండి నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నప్పటికీ..ఇంకా వేలాది విగ్రహాలు లైన్లో ఉన్నాయి. ముఖ్యంగా బషీర్‌బాగ్, బర్కత్‌పుర, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నారాయణగుడ ప్రాంతాల నుంచి గణనాథులు నిమజ్జనానికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు క్యూ కట్టాయి. ఇక ఓల్డ్ సిటీ నుంచి వచ్చే గణనాథులతో బషీర్‌బాగ్‌లోని బాబుజగ్జీవన్‌రావు విగ్రహం వరకు క్యూ కొనసాగుతోంది. దీంతో ఈరోజు రాత్రి వరకు నిమజ్జనం జరగనుంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు 1,02,500 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లుగా జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. అత్యధికంగా మూసాపేట ఐడియల్ చెరువులో 26,546 విగ్రహాలు, ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ మార్గ్ వద్ద 4,730 విగ్రహాలు, నెక్లెస్ రోడ్డులో 2,360 విగ్రహాలు, పీపుల్స్ ప్లాజా వద్ద 5,230 విగ్రహాలు, హైదరాబాద్ అల్వాల్ కొత్త చెరువులో 6,221 వినాయక విగ్రహాలను నిమజ్జనం అయినట్లుగా అధికారులు తెలిపారు. గ్రేటర్ పరిధిలో మొత్తంలో 71 ప్రాంతాల్లో నిమజ్జనాలు కొనసాగుతున్నాయని, బుధవారం సాయంత్రంలోగా కార్యక్రమం పూర్తికానుందని అధికారులు చెపుతున్నారు.
Read Also : Devara Promotion : ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి అంటూ యాంకర్ కు ఎన్టీఆర్ రిక్వెస్ట్