Ganesh Chaturthi: గ‌ణేశుడిని పూజించే అనుకూల‌మైన స‌మ‌య‌మిదే..!

పండితుల ప్రకారం.. ఈ రోజు గణపతి బప్పా జయంతి ఆరాధన భద్ర కాల నీడలో ఉంటుంది. పంచాంగం ప్రకారం.. ఈ రోజు భద్ర కాలము ఉదయం 4.20 నుండి సాయంత్రం 5.37 వరకు.

Published By: HashtagU Telugu Desk
Ganesh Chaturthi

Ganesh Chaturthi

Ganesh Chaturthi: ఈరోజు ఆటంకాలు తొలగించే గణేశుడి పండుగ రోజైన ‘గణేష్ చతుర్థి’ (Ganesh Chaturthi)ని దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకోనున్నారు. ఈ 10 రోజుల పండుగ సెప్టెంబర్ 17న అనంత చతుర్దశి రోజున శ్రీ గణేష్ మహానిమ‌ర్జ‌నంతో ముగుస్తుంది. పండితులు, జ్యోతిష్యుల ప్రకారం ఈ రోజు గణపతి బప్పా జయంతి ఆరాధన భద్ర కాల నీడలో ఉంటుంది. గణేశుడు ఎప్పుడు జన్మించాడు..? ఈరోజు భద్ర కాల వ్యవధి ఎంత..? రాహుకాలం ఎంతకాలం ఉంటుంది..? సరైన పూజా సమయం ఏమిటి అనేది తెలుసుకుందాం.

ఈ సమయంలో గ‌ణ‌ప‌తి జన్మించాడు

పురాణాల ప్రకారం ఒక రోజు తల్లి పార్వతి స్నానం చేయడానికి వెళుతున్నప్పుడు ఆమె ఒక బిడ్డను సృష్టించి అతనికి ప్రాణం పోసింది. అంతేకాకుండా స్నానం చేస్తున్న‌ప్పుడు కాపలాగా ఉంచి స్నానానికి వెళ్లింది. ఈ దివ్య ఘట్టం మధ్యాహ్న సమయంలో జరిగినట్లు నమ్ముతారు. ఈ అద్భుతం జరిగిన రోజు భాదో మాస శుక్ల పక్ష అష్టమి తిథి. తరువాత ఈ బాల గణేశుడు గణాలకు పాలకుడు అయ్యాడు. మొదటి పూజించే దేవుడు కూడా అయ్యాడు.

Also Read: Boeing Starliner : సునితా విలియమ్స్ లేకుండానే భూమికి బయలుదేరిన స్టార్ లైనర్.. ఎందుకు ?

నేడు భద్ర కాలం

పండితుల ప్రకారం.. ఈ రోజు గణపతి బప్పా జయంతి ఆరాధన భద్ర కాల నీడలో ఉంటుంది. పంచాంగం ప్రకారం.. ఈ రోజు భద్ర కాలము ఉదయం 4.20 నుండి సాయంత్రం 5.37 వరకు. నిజానికి భద్ర కాలంలో ఎలాంటి శుభ కార్యాలు జరగవు. కానీ గణేశుడే అడ్డంకులు, ఆటంకాలను తొలగించడంలో దిట్ట‌. గణేశుడు అగ్రగామి, మొదటిగా పూజించబడే దైవం. క్యాలెండర్‌లో నిర్ణీత సమయంలో ఆయన పూజలు ఈరోజు జరుగుతాయి. భద్ర కాలంలో వినాయకుడిని పూజించడం ఆమోదయోగ్యమైనదని పండితులు చెబుతున్నారు. సనాతన పంచాంగం ప్రకారం.. ఈరోజు రాహుకాలం ఉదయం 9.10 నుండి 10.45 వరకు. మత గ్రంథాల ప్రకారం.. రాహు కాలంలో ఎటువంటి శుభ కార్యాలు చేయరు.

గణేష్ చతుర్థి పూజలకు అనుకూలమైన సమయం

చతుర్థి తిథి సెప్టెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 3:01 గంటలకు ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 05:37 గంటలకు ముగుస్తుంది. గణేష్ చతుర్థికి సంబంధించినంత వరకు సెప్టెంబరు 7న ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 01:33 వరకు ఆరాధనకు అనుకూలమైన సమయం.

  Last Updated: 07 Sep 2024, 09:30 AM IST