Ganesh Chaturthi : ఈసారి వినాయక చవితి బుధవారం రోజున రావడం వల్ల ఎంతో ప్రత్యేకత కలిగిందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. బుధ గ్రహం జ్ఞానం, విద్య, కమ్యూనికేషన్, వ్యాపారాల్లో విజయానికి సూచిక. గణపతి కూడా ఇదే లక్షణాలను ప్రసాదించే దేవుడు కాబట్టి ఈ రోజు చేసే పూజలు రెట్టింపు శక్తితో ఫలిస్తాయని విశ్వసిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగార్థులు, కొత్త పనులు ప్రారంభించేవారికి ఈ చవితి మరింత శుభప్రదమని చెబుతున్నారు.
Cricketer Retire Rule: క్రికెటర్లు ఎలా రిటైర్ అవుతారు? ప్రాసెస్ ఇదేనా?!
ఈ పర్వదినాన వినాయకుడికి ఇష్టమైన మోదకాలతో పాటు ప్రత్యేక నైవేద్యాలు (Ganesh Chaturthi special recipes) సమర్పించడం వల్ల మరింత శుభఫలితాలు వస్తాయని అంటున్నారు. వాటిలో ముఖ్యమైనవి పసుపుతో కలిపిన బియ్యం, కొబ్బరికాయ, చెరకు గడ, తామర పువ్వు, అరటి ఆకు. పసుపుతో బియ్యం సమర్పించడం స్థిరత్వం, లక్ష్మీ అనుగ్రహాన్ని ఇస్తే, కొబ్బరికాయ మన అహంకారాన్ని విడిచిపెట్టి ఆరోగ్యం, శాంతి కలిగిస్తుంది. చెరకు తీపి, ఐక్యత, దీర్ఘాయువు సూచనగా భావిస్తారు.
అలాగే తామర పువ్వు పవిత్రత, విజయం సాధించడాన్ని సూచిస్తే, అరటి ఆకు పవిత్రత, సుఖసంతోషాలను తెస్తుంది. ఈ ఐదు నైవేద్యాలను గణపతికి సమర్పించడం ద్వారా సంపద, శాంతి, ఆరోగ్యం, విజయం లభిస్తాయని నమ్మకం. ముఖ్యంగా ఈసారి చవితి బుధవారం రోజున రావడం వల్ల ఈ నైవేద్యాలు మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.