Site icon HashtagU Telugu

Ganesh Chaturthi 2024: గణపయ్యకు వీటిని సమర్పిస్తే చాలు.. అనుగ్రహం తప్పకుండా కలగాల్సిందే!

Ganesh Chaturthi 2024

Ganesh Chaturthi 2024

ఈ ఏడాది వినాయక చవితి పండగ సెప్టెంబర్ 7వ శనివారం రోజు వినాయక చవితి పండుగను జరుపుకోనున్నారు. పండుగకు మరొక మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఇకపోతే వినాయక చవితి రోజున గణపయ్యకు అనేక రకాల నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటారు. గణపయ్యకు ఇష్టమైన నైవేద్యాలలో మోదకాలు కూడా ఒకటి. ఈ మోదకాలను సమర్పించడం వల్ల విఘ్నేశ్వరుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా గణపయ్యకు ఈ మోదకాలు అంటే చాలా ఇష్టమని చెబుతుంటారు. మరి విఘ్నేశ్వరుడికి ఇష్టమైన ఈ మోదకాలను ఎలా తయారు చేస్తారు? అందుకు ఏ ఏ పదార్థాలు కావాలి అన్న విషయానికి వస్తే..

మోదకాలు తయారీకి కావాల్సిన పదార్థాలు.. బియ్యం పిండి, బెల్లం, కొబ్బరి, యాలకులు, డ్రై ఫ్రూట్స్, డ్రై ప్రూట్స్, ఉప్పు. ఎలా తయారు చేయాలన్న విషయానికి.. ఈ మోదకాలు తయారు చేయడానికి ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులో నీళ్లు, కొద్దిగా ఉప్పు, నెయ్యి కొద్దిగా వేసి మరిగించాలి. ఇలా నీళ్లు మరుగుతున్న సమయంలో బియ్యం పిండి వేసి చిన్న మంట మీద పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి. బియ్యం పిండి ఉడికాక మూత పెట్టి పక్కన పెట్టాలి. ఇప్పుడు మరో గిన్నె తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి అయిన తర్వాత కొబ్బరి తురుము వేసి వేయించాలి. కొబ్బరి తురుము వేగాక బెల్లం వెసి చిన్న మంట మీద కరిగేంత వరకు వేడి చేయాలి. బెల్లం కరిగాక ఇందులో డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి కలపాలి.

మరోవైపు పిండి చల్లారి ఉంటుంది. దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ముద్ద తీసుకుని వాటి మధ్యలో కొబ్బరి బెల్లం మిశ్రమం పెట్టి ఆ తర్వాత వీటని మోదకాల షేపులో తయారు చేసుకోవాలి. ఇలా అన్ని మోదకాలు తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన మోదకాలను కుక్కర్ ప్లేటులో నెయ్యి రాసి పెట్టి ఇవన్నీ అందులో పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికిస్తే చాలు మోదకాలు సిద్ధం అయినట్లే. ఇవి చాలా రుచిగా ఉంటాయి. అయితే విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఈ మోదకాలను సమర్పించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి అని ఆయన అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుందని చెబుతున్నారు.

Exit mobile version