Ganesh Chaturthi: ఇంట్లో గణేష్ పూజ.. చేయాల్సినవి,చేయకూడని పనులు ఇవే?

ఇండియాస్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పండుగ వినాయక చవితి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ వినాయక చవితి పండుగను

  • Written By:
  • Publish Date - September 14, 2023 / 07:25 PM IST

ఇండియాస్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పండుగ వినాయక చవితి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. భారీ విగ్రహాలను ఏర్పాటు చేసి 11 రోజులపాటు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ముంబై మహారాష్ట్ర సైడ్ ఈ వినాయక చవితిని చాలా ఘనంగా జరుపుకుంటారు అని చెప్పవచ్చు.. ఆ సంగతి పక్కన పెడితే వినాయక చవితి రోజు కొంతమంది ఇంట్లో కూడా విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కొందరు తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. గణేష్ విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించి పూజ చేసే సమయంలో కొన్ని నియమాలు పాటించాలి. వీటిని అస్సలు మరచిపోకూడదు.

లేదంటే మీకు అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీ ఇంట్లో వినాయకుని ప్రతిమ ఉంచే ముందు మీరు, మీ ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. పర్యావరణానికి అనుకూలమైన మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాన్ని తీసుకురావాలి. వినాయకుని తొండం ఎడమవైపునకు తిరిగి ఉండాలి. అయితే కుడివైపునకు తిరిగి ఉన్న తొండం ఉన్న వినాయకుడిని తీసుకోవచ్చు. అయితే కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాల్సి ఉంటుంది. వినాయకుని ప్రతిమను ఇంట్లోకి తెచ్చే సమయంలో ఏదైనా వస్త్రంతో లేదా గణేశుడి తలను కప్పి ఉంచాలి. పూజ ప్రారంభించేంత వరకు అది తీయకూడదు. పూజ ప్రారంభించేటప్పుడు కొంత గంగాజలంతో వినాయకుడి విగ్రహాన్ని శుభ్రం చేయాలి. ఎరుపు రంగు గంధపు తికాలన్ని గణపతి నుదుటిపై ఉంచాలి.

అనంతరం విఘేశ్వరుని పవిత్ర మంత్రాలు పఠించాలి. మీరు విగ్రహాన్ని మీ ఇంట్లో ఒకటిన్నర రోజు, మూడు రోజులు, ఐదు రోజులు, ఏడు రోజులు, పది రోజులు లేదా నిమజ్జనం వరకు ఇంట్లో ఉంచుకోవచ్చు. వినాయకుడి పూజ సమయంలో లంబోదరుడికి ఇష్టమైన ఉండ్రాళ్లు, గరిక, కొబ్బరికాయ, వెలగకాయ, లడ్డు, వంటి నైవేద్యాలను సిద్ధం చేసుకోవాలి. అలాగే ఐదు రకాల పండ్లు, పంచామృతంతో పూజలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే వినాయకుడికి కొబ్బరినూనెతోనే దీపారాధన చేయాలి. బెల్లంతో తయారు చేసిన ఆహార పదార్థాలతో నివేదన చేయాలి. వినాయకుడికి ఇష్టమైన రోజు బుధవారం. ఈ పవిత్రమైన రోజున మీ సామర్థ్యం మేరకు పేదలకు దాన ధర్మాలు చేయాలి. వినాయక చవితిని గోమాతను కూడా పూజిస్తే మీ సమస్యలు తొలగిపోతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, మీ ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో వినాయకుడి విగ్రహాన్ని అస్సలు ఉంచకూడదు.

మీ ఇంటి మెయిన్ గేటుకు ఎదురుగా, ఇంట్లోకి ప్రవేశించే మార్గం సమీపంలో వినాయకుని విగ్రహం ఉంచకూడదు. అలాగే వినాయకుని విగ్రహం బాత్ రూమ్ గోడ సమీపంలో అస్సలు పెట్టకూడదు. అదే విధంగా హాలులో కూడా వినాయక విగ్రహాన్ని ఉంచి పూజ చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. భార్యభర్తల మధ్య తరచుగా గొడవలు, ఆందోళన పెరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి వీటిని నివారించాలి. మీ ఇంట్లో నాట్యం చేస్తున్నట్లు ఉన్న వినాయక విగ్రహాన్ని పొరపాటున కూడా ఉంచుకోవద్దు. అలాగే ఇలాంటి విగ్రహాలను ఎవ్వరికీ గిఫ్టుగా కూడా ఇవ్వకూడదట. నాట్యం చేస్తున్న వినాయక విగ్రహం ఉంటే, ఆ ఇంట్లో నిత్యం గొడవలు, వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది.