భారతదేశంలో ఉండే హిందువులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు అత్యంత ఘనంగా సంతోషంగా జరుపుకునే పండుగలలో వినాయక చవితి కూడా ఒకటి. చిన్న పెద్ద అని వయసుతో తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండుగను సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మూడు రోజుల నుంచి దాదాపు 11 రోజుల వరకు ఈ పండుగను సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా చిన్న చిన్న మట్టి విగ్రహాల నుంచి భారీ గణనాధులను ఏర్పాటు చేసి మరి ఘనంగా పూజలు చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్ల పక్ష చతుర్థి తిథి రోజున వినాయక చవితిని జరుపుకుంటారు.
ఈ పండుగను దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకుంటారు. అయితే మహారాష్ట్రలోని ముంబై, హైదరాబాద్ లో జరిగే గణేష్ చతుర్థి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ వినాయక చవితి రోజున హిందువుల ఇంట్లో గణపతి విగ్రహాలను ప్రతిష్టించి వైభవంగా చవితి పూజను చేస్తారు. గణేష్ చతుర్థి సందర్భంగా ప్రజలు తమ ఇళ్లలో గణేశుడిని ప్రతిష్టించి నియమ నిష్టలతో ఆచారాలతో పూజిస్తారు. గణపతి బప్పా అనుగ్రహంతో తమ జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు వస్తాయని విశ్వాసం. ఈ పండుగ 10 రోజుల పాటు నిర్వహిస్తారు. అనంత చతుర్దశి రోజున గణపతి బప్పా విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు.
అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 7 లేదా 8 ఈ రెండు తేదీలలో ఎప్పుడు వినాయక చవితిని జరుపుకోవాలి అన్న విషయాన్ని వస్తే.. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి సెప్టెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 3:01 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు 7వ తేదీ సాయంత్రం 5:37 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం వినాయక చవితి సెప్టెంబర్ 7 శనివారం నుండి ప్రారంభమవుతుంది. ఈ రోజున వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేసుకోవడం మంచిదని చెబుతున్నారు పండితులు. సెప్టెంబర్ 7వ తేదీన గణేష్ చతుర్థి పూజలు, విగ్రహ ప్రతిష్ఠాపనకు అనుకూలమైన సమయం ఉదయం 11.03 నుంచి మధ్యాహ్నం 1.34 గంటల వరకు ఉంటుంది.
ఈ విధంగా సెప్టెంబర్ 7వ తేదీన వినాయక ఆరాధనకు విగ్రహ ప్రతిష్టాపన కోసం పవిత్ర సమయం 2 గంటల 31 నిమిషాల పాటు శుభ ముహర్తం ఉంటుంది. ఈ సమయంలో భక్తులు గణపతి బప్పను పూజించడం మంచిది. అయితే గణపతి విగ్రహాన్ని ఏ విధంగా ప్రతిష్టించాలి అన్న విషయానికి వస్తే.. మట్టితో తయారు చేసిన విఘ్నేశ్వరుడిని ప్రతిష్టించాలి. కేవలం కుడి వైపున తొండం ఉన్న గణపతిని మాత్రమే పూజించాలి. వినాయకుడికి ఎలుక ఉండడం తప్పనిసరి. ఎల్లప్పుడూ కూర్చుని ఉన్న భంగిమలో ఉన్న వినాయకుడిని మాత్రమే పూజించాలని చెబుతున్నారు. వినాయకుని విగ్రహాన్ని ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య మూలలో ప్రతిష్టించాలి. ఈ ప్రదేశం స్వచ్ఛంగా, పవిత్రంగా ఉండాలి. గణేశుడి విగ్రహం పశ్చిమం వైపు ఉండాలి. చెక్క ప్లాట్‌ఫారమ్‌పై ఎరుపు లేదా పసుపు గుడ్డను పరచి దానిపై గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించాలి. ఆ తర్వాత నిమజ్జనం సమయంలో మాత్రమే అక్కడ నుంచి గణేశుడి విగ్రహాన్ని తీసి సాంప్రదాయ పద్దతిలో నిమజ్జనం చేయాలి.