Site icon HashtagU Telugu

Ganesha Puja Muhurat : రేపు ఏ సమయానికి వినాయక పూజ చేయాలంటే..!!

Ganesh Pooa

Ganesh Pooa

Ganesh Chaturthi 2024 – Know Puja Timings, Fasting Rules And Rituals : మరికొద్ది గంటల్లో ప్రతి గల్లీలో గణనాథుల నవరాత్రి ఉత్సవాలు (GANESH Navratri Puja Celebrations) మొదలుకాబోతున్నాయి. దేశ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయనే సంగతి తెలిసిందే. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి (Ganesh Chaturti ). ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈ పండగను అంగరంగ వైభవంగా ప్రజలు జరుపుకొంటారు. ఈ సంవత్సరం చవితి తిథి సెప్టెంబర్​ 6 తేదీన అలాగే సెప్టెంబర్​ 7వ తేదీన.. రెండు రోజుల పాటు ఉందని జ్యోతిష్యులు చెపుతున్నారు. రేపు ఉదయం 11:03 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల మధ్యలో ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఉదయం పూజ చేసుకోలేని వారు సాయంత్రం 6:22 గంటల నుంచి రాత్రి 7:30 గంటల మధ్యలో వరసిద్ధి వినాయక వ్రత కల్పం చేసుకోవచ్చని చెపుతున్నారు.

ఇక వినాయక పూజాకు కావాల్సిన సామాగ్రి వివరాలు

పసుపు, కుంకుమ, పూలు, పూలదండలు, తమలపాకులు, వక్కలు, కర్పూరం, అగరబత్తులు, గంధం, అక్షింతలు, అరటిపండ్లు, కొబ్బరికాయ, బెల్లం, తోరము, దీపారాధన కుందులు, నెయ్యి, వత్తులు, వినాయకుడి ప్రతిమ, పంచామృతం, పత్రి, ఉండ్రాళ్ళు, మూడు లేదా ఐదు రకాల నైవేద్యాలు. వీటితోపాటు పత్రిగా పిలుచుకునే 21 రకాల ఆకులు కూడా ఉండాలి.

వినాయక చవితి రోజు ఇంట్లో చేయాల్సిన పనులు

వినాయక చవితి ఉదయం లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మామిడి ఆకులతో తోరణాలు కట్టుకోవాలి. వాకిళ్ళ ముందు ముగ్గులు వేయాలి. ఆ రోజు అందరూ తలంటు స్నానాలు చేయాలి. దేవుని గదిలో లేదా ఒక పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీట వేసి దానిపైన వినాయక విగ్రహాన్ని ఉంచాలి. వినాయకుడికి ఎంతో ఇష్టమైనవి ఉండ్రాళ్లు. ఏ నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా కచ్చితంగా ఉండ్రాళ్లను పెట్టాలి. బొబ్బట్లు కూడా పెడితే మంచిది, మూడు లేదా ఐదు రకాల నైవేద్యాలను తయారుచేసి స్వామివారికి నివేదించాలి.

చవితి రోజు ధరించాల్సిన దుస్తులు

వినాయకుడికి ఎరుపు రంగు వస్త్రాలంటే ప్రీతిపాత్రమని.. పండగ రోజున ఈ రంగు వస్త్రాలు ధరిస్తే మంచిదని చెబుతున్నారు. అదేవిధంగా.. వినాయక చవితి శనివారం వచ్చింది కాబట్టి.. శనివారానికి అధిపతి శనేశ్వరుడు కాబట్టి.. ఆయనకు ఇష్టమైన నీలం రంగు దుస్తులు ధరించినా మంచిదని చెబుతున్నారు. కాబట్టి పండగ నాడు ఎరుపు లేదా నీలం రంగు వస్త్రాలు ధరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని అంటున్నారు.

Read Also : Ganesh Chaturthi : ‘పుష్పరాజ్ – శ్రీవల్లి’ గా గణనాథుడు…ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు