Site icon HashtagU Telugu

Ganesh Chaturthi 2023: ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు వచ్చింది.. ముహూర్తం, పూజా సమయం ఇవే?

Ganesh Chaturthi 2023

Ganesh Chaturthi 2023

త్వరలోనే వినాయక చవితి పండుగ రాబోతోంది. ఈ పండుగ కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ పండుగ వచ్చింది అంటే చాలు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే హిందువుల విషయానికొస్తే హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలలో వినాయక చవితి కూడా ఒకటి. దాదాపు మూడు రోజుల నుంచి 11 రోజుల వరకు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. 11వ రోజున స్వామివారిని నిమజ్జనం చేస్తూ ఉంటారు. గణపతి భాద్రపద మాసంలోని శుక్ల పక్షం చతుర్థి రోజున జన్మించాడు.

ఈ సంవత్సరం ఈ తేదీ సెప్టెంబర్ 18వ తేదీతో పాటు సెప్టెంబర్ 19 న వచ్చింది. దీంతో వినాయక చవితిని కొందరు సెప్టెంబర్ 18న జరుపుకుంటుండగా, మరికొందరు సెప్టెంబర్ 19 న జరుపుకుంటున్నారు. అనంతరం సెప్టెంబర్ 28 న గణపతి నిమజ్జనం కార్యక్రమం జరగనుంది. మరి ఏడాది శుభ సమయం ఎప్పుడు వచ్చింది. పండుగను ఎలా జరుపుకోవాలి అన్న విషయానికి వస్తే.. పంచాంగం ప్రకారం వినాయక చవితి సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12.39 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 19వ తేదీ రాత్రి 8.43 గంటలకు ముగుస్తుంది.

ఉదయ తిథి ప్రకారం గణేష్ చతుర్థి సెప్టెంబర్ 19 న జరుపుకోనున్నారు. గణేష్ పూజ జరుపుకోవడానికి శుభ సమయం 2: 27 నిమిషాలు. ఈ సమయం ఉదయం 11:01 నుండి మధ్యాహ్నం 01:28 వరకు ఉంటుంది. పూజా విధానం విషయానికి వస్తే.. వినాయక చవితి పండుగ రోజ తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించి పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం ఈశాన్య మూలలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని, పీఠంపై ఎరుపు లేదా పసుపు వస్త్రాన్ని పరచాలి. గణపతి విగ్రహాన్ని ముహర్తం చూసుకుని శుభ సమయంలో ఇంటికి తీసుకొచ్చి పీఠంపై ఏర్పాటు చేసుకోవాలి. గణపతిని ప్రతిష్టించిన తర్వాత 10 రోజుల పాటు ఆచారాల ప్రకారం వినాయకుడిని పూజించాలి. ఈ సమయంలో వారికి మోదకం, సిందూరం, గడ్డిని సమర్పించడం మంచిది. 11వ రోజు నియమాల ప్రకారం భక్తి శ్రద్దలతో విగ్రహాన్ని నిమజ్జనం చేసి వినాయకుడికి వీడ్కోలు చెప్పాలి.