Tirumala: నిండిన తిరుమల జలాశయాలు, నీటి కొరతకు చెక్

  • Written By:
  • Publish Date - December 6, 2023 / 11:54 AM IST

Tirumala: ఏపీలో తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో వాగులు, వంకలతో పాటు ప్రధాన ప్రాజెక్టులు, జలశయాలు నీటితో పరవళ్లు తొక్కుతున్నాయి. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ నుంచి కూడా నీటిని తీసుకుంటారు.

తిరుమలలో కేవలం 24 గంటల్లోనే 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఫలితంగా తిరుమలకు దాదాపు 250 రోజుల తాగునీటి అవసరాలకు సరిపోతాయి. శ్రీ‌వారి అనుగ్ర‌హంతో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండాయ‌ని, దాదాపు ఏడాదికి సరిపడా తాగు నీళ్లు ఉన్న‌ట్లు టీటీడీ ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి తెలిపారు.

మైచాంగ్ తుఫాను కారణంగా గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలో నిండిన జలాశయాలను ఛైర్మ‌న్ అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్బంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ, 15 రోజుల క్రితం తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో నీటి కొర‌త ఎక్కువ‌గా ఉన్న‌ద‌ని, ప్రస్తుత వర్షాలతో నీటి కొరత తీరిందని ఆయన అన్నారు.