వారంలో ఒక్కొక్క రోజు కొన్ని రకాల పనులు చేయడం నిషిద్ధం అని అంటున్నారు పండితులు. అలా తెలిసి తెలియక చేసే తప్పులు వల్ల లేనిపోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అటువంటి వాటిలో శుక్రవారం రోజు కొన్ని రకాల పనులు చేయకూడదు అన్న నిషేధం కూడా ఒకటి. మరి శుక్రవారం రోజు ఎలాంటి పనులు చేయకూడదు ఒకవేళ చేస్తే ఏం జరుగుతుంది ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈరోజున లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు.
అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజున కొన్ని రకాల పనులు చేయకూడదట. అవేంటి అన్న విషయానికొస్తే.. శుక్రవారం రోజు చీపురు, చేటను కాలితో తన్నడం లాంటివి చేయకూడదట. కేవలం శుక్రవారం రోజు అని మాత్రమే కాకుండా మామూలు వారాలలో కూడా చీపురును చేటకు అస్సలు తన్న కూడదు. అలాగే మాసిపోయిన బట్టలు ఉతకకుండా తర్వాత రోజు వేసుకోకూడదు. ఒకరు స్నానం చేసిన తర్వాత మిగిలిన నీటితో ఇంకొకరు స్నానం చేయడం అన్నది కూడా మంచిది కాదు. ఇల్లు ఎప్పుడు దీపం లేకుండా ఉండకూడదు. సాయంత్రం వేళలో తల్లదువ్వడం లాంటివి చేయకూడదు.
అలాగే ఇల్లు ఊడ్చడం లాంటివి కూడా చేయకూడదు. ఇల్లు శుభ్రం చేయాలి అనుకుంటే సూర్యోదయం కంటే ముందు చేయాలి. తలకు నూనె పట్టించుకున్న తర్వాత అదే చేత్తో మరికొరి తలకు నూనె పట్టించరాదు. మంగళవారం అలాగే శుక్రవారాలలో మాసిన బట్టలను ఉతకకూడదు. గడప మీద కూర్చోవడం గడపను కాలితో తన్నడం గడప మీద కాలు పెట్టి నిలబడడం లాంటివి అస్సలు చేయకూడదు. రాత్రిపూట పడుకునేటప్పుడు కాళ్లు కడుక్కునే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే కాళ్ళు కడుక్కోవడం మంచిదే కానీ తుడవకుండా అలాగే పడుకుని నిద్రపోకూడదు. ఈ విషయాలను తప్పకుండా పాటించాలని లేదంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనవ్వక తప్పదు అని చెబుతున్నారు.