Site icon HashtagU Telugu

Friday: శుక్రవారం రోజు ఉపవాసం ఉంటే చాలు.. మీరు కోరిందల్లా బంగారమే!

Friday

Friday

వారంలో శుక్రవారం రోజున ఉపవాసం ఉండడం వల్ల అనేక మంచి మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మరి శుక్రవారం రోజు ఉపవాసం అంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? పూజా విధానం ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శుక్రవారం చాలామంది అమ్మ వార్లను పూజిస్తూ ఉంటారు. వారిలో సంతోషిమాత కూడా ఒకరు. చాలామంది సంతోషిమాత అనుగ్రహం కోసం శుక్రవారం నాడు పూజిస్తూ ఉంటారు. అయితే శుక్రవారం రోజు ఉపవాసం ఉండి పూజించడం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయట.

అమ్మవారి పేరుకు తగ్గట్టుగానే సంతోషాన్ని ప్రసాదిస్తుందట. మీ కలలను సాకారం చేయడానికి మాత మీకు సహకరిస్తుందట. మహిళలు సంతోషీ మాత దయను పొందేందుకు ఉపవాసం ఉంటారు. కనీసం 16 శుక్ర వారాలు అయిన ఉపవాసం ఉంటే కోరికలు తీరతాయని భక్తుల నమ్మకం. మరి శుక్రవారం రోజు ఎలా పూజ చేయాలి అన్న విషయానికి వస్తే.. భక్తులు ఉదయాన్నే నిద్రలేచి బ్రహ్మస్నానాన్ని ఆచరించాలి. సూర్యోదయానికి ముందే ఆచరించే స్నానాన్ని బ్రహ్మస్నానం అనంటారు. తర్వాత పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. పువ్వులు , చక్కెర, వేయించిన ముడిశెనగలు, నేతితో వెలిగించిన దీపం అగరబత్తిని సిద్ధం చేసుకోవాలి.

ఈ రోజు కేవలం ఒక్కసారి మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. పుల్లటి పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. అలాగే పుల్లటి వాటిని ఇతరులకు వడ్డించకూడదట. వ్రత ఉద్యాపన సమయంలో ఎనిమిది మంది అబ్బాయిలకు భోజనాన్ని వడ్డించాలి. మీరు వడ్డించే ఆహారంలో పుల్లటి పదార్థాలు ఉండకుండా జాగ్రత్తపడాలనీ చెబుతున్నారు. అలాగే ఉపవాసం వారు కూడా పుల్లటి పదార్థాలను తినకూడదని చెబుతున్నారు. శుక్రవారం రోజు ఉపవాసం ఉండడంతో పాటుగా పైన చెప్పిన విషయాలను పాటించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి మీరు ఏది కోరినా కూడా నెరవేరుస్తుందని చెబుతున్నారు.