Site icon HashtagU Telugu

Yadadri : టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు: సీఎం కీలక ఆదేశాలు

Transgenders for traffic control: CM orders to officials

Transgenders for traffic control: CM orders to officials

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి యాదగిరిగుట్ట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. తిరుమల వెంకన్న ఆలయం స్థాయిలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డి యాదాద్రి అభివృద్ధిపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. యాదగిరిగుట్ట పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలని, ఆలయ రాజ గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వైటిడిఏ, యాదగిరిగుట్టకు సంబంధించి పూర్తి స్టేటస్ రిపోర్ట్ తనకు అందించాలని అధికారులకు సూచించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీలో తిరుమల ఆలయానికి టీటీడీ బోర్డు ఉన్నట్లుగా.. తెలంగాణలో యాదాద్రి కి టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్  నిర్ణయం తీసుకున్నారు . ఏకో, టెంపుల్ టూరిజం అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీటితోపాటు హెల్త్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. హైదరాబాద్ బయట మారో జూ పార్క్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి ఉన్న వనరుల అభివృద్ధికి అవసరమైన చోట పీపీపీ విధానాన్ని అవలంబించాలన్నారు.

కాగా, ‘స్పీడ్’ ప్రాజెక్టులపై ఈరోజు సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి సీఎస్‌ శాంతి కుమారి, మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ రమేశ్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు. హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి నూతన విధానం రూపొందించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లోని ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని, ఎకో, టెంపుల్ పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. హెల్త్‌ టూరిజంను అభివృద్ధి చేయాలన్న రేవంత్‌ రెడ్డి, హైదరాబాద్ బయట మరో జూపార్క్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

Read Also: BJP : బీజేపీలో చేరిన మాజీ సీఎం చంపై సోరెన్‌