New Year 2026 : నూతన సంవత్సరం 2026 వేడుకలకు మరెంతో సమయం లేదు. మరికొద్ది రోజుల్లో 2025కు వీడ్కోలు పలికి.. 2026 కొత్త ఏడాదికి Grand Welcome చెప్పేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతోంది. 2025 ఏడాది మిగిల్చిన మంచి, చెడు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ.. కోటి ఆశలతో కొత్త సంవత్సరం 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలకనున్నారు. ఇప్పటికే చాలా మంది న్యూ ఇయర్ గిఫ్ట్స్ ఐడియాస్ కోసం ఆలోచనలు చేసేస్తున్నారు. అలాగే నూతన సంవత్సరం 2026 శుభాకాంక్షలు కొత్తగా దైవిక మంత్రాలతో కలిపి చెబితే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా..
మన దేశంతో పాటు అన్నీ దేశాల ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగల్లో ఆంగ్ల నూతన సంవత్సరం (New Year 2026) ఒకటి. నూతన సంవత్సరం వేడుకలను అన్నీ దేశాల ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా బ్రిటన్, అమెరికా, దుబాయ్ వంటి దేశాల్లో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈరోజున ప్రజలంతా ఎంతో ఆనందోత్సాహాలతో ఒకరికొకరూ శుభాకాంక్షలు (New Year 2026 Wishes) తెలియజేసుకుంటూ.. స్వీట్లు పంచుకుంటారు. ఈ క్రమంలో మీరు కూడా మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులకు ఇలా మంత్రాలతో కలిపి నూతన సంవత్సరం శుభాకాంక్షలు (New Year 2026 Wishes in Telugu) తెలియజేయండి..
ఓం శ్రీ గణేశాయ నమః
మీరు తలపెట్టే కార్యాల్లో ఆటంకాలు తొలగాలని
విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరం 2026 శుభాకాంక్షలు
ఓం గం గణపతయే నమః
జీవితంలో అన్నీ అడ్డంకులు తొలగిపోవాలని
జ్ఞానం, శుభ ఫలితాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మీకు మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సరం 2026 శుభాకాంక్షలు
ఓం శ్రీం మహాలక్ష్మై నమః
మీకు జ్ఞానం, ఐశ్వర్యం, సిరిసంపదలు ప్రసాదించాలని లక్ష్మీదేవికి నమస్కరిస్తూ
మీకు మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సరం 2026 శుభాకాంక్షలు
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయా ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః
కొత్త ఏడాదిలో మీకు సంపద, అదృష్టం, ఆరోగ్యం, కీర్తి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మీకు మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు 2026
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
శ్రీమహావిష్ణువు దయతో అంతర్గత శాంతి, దైవిక రక్షణ ఉండాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు 2026
ఓం శ్రీ విష్ణవే చ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్
విష్ణుమూర్తి దయతో మీకు జ్ఞానం, సరైన మార్గదర్శకత్వం, జీవితంలో కొత్త వెలుగులు కలగాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్ 2026
ఓం నమః శివాయ
పరమేశ్వరుడి దయతో మీకు దైవిక రక్షణ, అంతర్గత బలం, సానుకూల శక్తి కలగాలని అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబసభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్ 2026
ఓం రుద్రాయ నమః
శివుడి దయతో మీ జీవితంలో ప్రతికూల ఫలితాలు, ప్రతికూల శక్తులు తొలగి.. అన్నీ అడ్డంకులు అధిగమించి గొప్ప విజయం సాధించాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
ఆ అయ్యప్ప స్వామి దయతో మీకు అంతర్గత శక్తి, ఏకాగ్రత, ధైర్యం కలగాలని.. అడ్డంకులన్నీ తొలగాలని.. అయ్యప్ప స్వామి సంపూర్ణ అనుగ్రహం మీపై ఉండాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరం 2026 శుభాకాంక్షలు
ఓం నమో వెంకటేశాయ నమః
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దయతో మీకు కష్టాలు తొలగిపోయి.. శాంతి, సంపద, ఆరోగ్యం లభించాలని.. కోరిన కోర్కెలు నెరవేరాలని.. స్వామి వారి అనుగ్రహం పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబసభ్యులకు హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ 2026
