Krishnashtami 2024: కృష్ణుడు తలలో నెమలి పించం ఎందుకు పెట్టుకుంటాడో మీకు తెలుసా?

శ్రీకృష్ణుడు తన తలపై నెమలి పించం ఎందుకు పెట్టుకుంటాడు అన్న విషయం గురించి పండితులు తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
The Story Behind Krishna Wearing A Peacock Feather On His Head

The Story Behind Krishna Wearing A Peacock Feather On His Head

హిందువులు అలాగే శ్రీకృష్ణుడి భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి రానే వచ్చేసింది. ఇప్పటికే కృష్ణుడి ఆలయాల్లో అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. రేపు అనగా ఆగస్టు 26 సోమవారం రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరగనున్నాయి. కాగా ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో కృష్ణ పక్ష అష్టమి తిథి రోజున అత్యంత వైభవంగా కృష్ణాష్టమి జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ జన్మాష్టమి ఆగష్టు 26వ తేదీ వచ్చింది. ఈ రోజున ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ సందడే వేరు. చిన్న పిల్లలను కృష్టుడిలా అలంకరించి సంబర పడిపోతారు.

అలాగే అమ్మాయిలకు గోపికల వేషం వేస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా ఆనందంగా, కోలాహలంగా ఉంటుంది. కృష్ణుడిని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. అదే విధంగా కృష్ణయ్యను పూజించే సమయంలో ఎంతో అందంగా అలంకరణలు కూడా చేస్తూ ఉంటారు. సాధారణంగానే కన్నయ్యకు అలంకరణ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చూసినా ఎంతో చక్కగా, అందంగా కనిపిస్తాడు. కృష్ణయ్య అందాన్ని పెంచడంలో నెమలి పింఛం కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పాలి. కృష్ణుడిని మనం ఎక్కడ చూసినా కూడా తప్పకుండా ఆయన తలపై మనకు నెమలి పించం కనిపిస్తూ ఉంటుంది. అయితే శ్రీకృష్ణుడు తలపై నెమలి పించంను ఎందుకు ధరిస్తాడు అన్న సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది.

మరి దాని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కృష్ణుడికి రాధకు మధ్య ఉన్న బంధం గురించి మనందరికీ తెలిసిందే. రాధాకృష్ణుల ప్రేమ అనంతం. రాధ అంటే కృష్ణయ్యకు చాలా ఇష్టం. రాధ మీద ప్రేమ కారణంగానే కృష్ణుడు నెమలి పింఛం పెట్టుకుంటాడట. పురాణాల ప్రకారం..రాధ ప్యాలెస్‌ లో చాలా నెమళ్లు ఉండేవట. ఒకసారి కృష్ణ వేణువు వాయిస్తూ ఉండగా,రాధ ట్యాన్స్ చేయడం ప్రారంభించిందట. రాధతో పాటు నెమళ్లు కూడా పారవశ్యంతో నృత్యం చేశాయట. ఈ క్రమంలోనే ఒక నెమలి డ్యాన్స్ చేస్తుండగ దాని ఈక కింద పడింది. దాన్ని తీసుకుని కృష్ణుడు తలలో పెట్టుకున్నాడట. అప్పటి నుంచి రాధ ప్రేమకు గుర్తుగా నెమలి ఈకను ధరిస్తాడట. అంతేకాకుండా నెమలి ఈకను పెట్టుకోవడం వెనుక మరొక కారణం కూడా ఉందని చెబుతారు. అదేమిటంటే కృష్ణుడు సోదరుడు బలరామ్ శేషనాగ్ అవతారమని, కాబట్టి నెమలి, పాము అనేవి శత్రువులు. ఈ రెండింటికీ అస్సలు పడదు. కానీ ఎవరినైనా ఒకటి చేసే తత్వం కన్నయ్యకు ఉంది. అయితే కృష్ణుడు నుదుటిపై ఉన్న నెమలి ఈక శత్రువుకు కూడా తన జీవితంలో ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తుందనే సందేశాన్ని ఇస్తుంది.

  Last Updated: 25 Aug 2024, 11:04 AM IST