Cloths: ఇతరులు వాడిన దుస్తులు వేసుకుంటున్నారా.. దోషాలు అంటుకుంటాయి జాగ్రత్త?

సాధారణంగా చాలామంది ఒకరు ధరించిన దుస్తులను మరొకరు ధరిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా యూత్ బాయ్స్

  • Written By:
  • Publish Date - January 27, 2023 / 06:00 AM IST

సాధారణంగా చాలామంది ఒకరు ధరించిన దుస్తులను మరొకరు ధరిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా యూత్ బాయ్స్ అయితే ఫ్రెండ్స్ ధరించిన టీషర్ట్ లేదా షర్ట్ బాగా నచ్చింది అంటే చాలు వెంటనే వాటిని ధరిస్తూ ఉంటారు. అలాగే చాలామంది వయసులో వారి కంటే పెద్దవారు కొనుక్కున్న బట్టలు పైకి అయిపోవడం లేదంటే పట్టకపోవడం ఫిట్ గా అయిపోవడం వల్ల ఇతరులకు ఇస్తూ ఉంటారు. అయితే అలా ఇచ్చిన బట్టలు వేసుకున్న వారికి ఊహించిన విధంగా దోషాలు అంటుకుంటాయి అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఒక రకంగా చెప్పాలి అంటే ఒక రకమైన ఎనర్జీ క్రియేట్ అవుతుందట.

అలా తీసుకున్న తర్వాత కొంతమందికి అసౌకర్యంగా అలాగే చెడు సంఘటనలు కూడా జరగవచ్చు. అందుకే ఎప్పుడూ మనం వాటిని దుస్తులను ఇతరులకు ఇవ్వకపోవడం మంచిది. కానీ కొత్త దుస్తులు ధరించడం వల్ల ఇటువంటి పరిణామాలు సంభవించవు. ఒకవేళ మనం ఉపయోగించిన బట్టలను వెతుకులకు ఇవ్వాల్సి వస్తే అటువంటి సమయంలో ఉప్పు నీళ్లతో నింపిన బకెట్లో వేసి దాదాపు ఒకరోజు నానబెట్టి ఆ తర్వాత బట్టలు ఆరిపోయిన తర్వాత ఇతరులకు ఇవ్వవచ్చు. ఇదివరకు రోజుల్లో అనగా పాత రోజుల్లో ఈ విధంగానే చేసేవారు. ఈ విధంగా చేయడం వల్ల దోషాలు కూడా రావు. అదే విధంగా, మన పాత దుస్తులను వంట గదిలోను, ఇతరు వాహనాలు తుడవడానికి కూడా ఉపయోగిస్తుంటారు.

అప్పుడు కూడా మనం వాటిని, ఉప్పు నీళ్లలో నానబెట్టి, ఆ తర్వాతే బట్టలను తుడవటానికి ఉపయోగించాలి. కానీ ఇవి పాటించకుండా ఉపయోగిస్తే దాని వలన మనకు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అలాగే కొన్ని సార్లు మనం మన పాత బట్టలను కవర్లలో పెట్టేసి, చెత్త బుట్టలపై, లేదా రోడ్డుమీద వెళ్లే వారికి దానంగా ఇస్తూ ఉంటారు. కానీ కొన్ని సార్లుదాని వలన మనకు కీడు జరిగే అవకాశం ఉంటుంది. రోడ్డు మీద కొందరు మంత్రగాళ్లు ఉండవచ్చు. వారు మనం వేసుకున్న బట్టలతో చేతబడిలు, మంత్రాలకు ఉపయోగించే అవకాశం ఉంటుంది. అందుకే మన బట్టలను కనుక ఉప్పు నీళ్లలో వేసి ఆరిన తరువాత ఇస్తే ఎలాంటి బాధలు, ధోషాలు, ఉండవు. ఉప్పునీటిలో వేయడం వలన మనం వాడిన బట్టలకు, మనకు మధ్యన ఉండే ఒకరకమైన ఎనర్జీ అనేది బ్రేక్ అయిపోతుంది. అందుకే వీలైనంత వరకు వాడిన బట్టలను ఉప్పు నీటిలో వేసిన తర్వాత ఇవ్వాలి.