Site icon HashtagU Telugu

Kartik Month Food Rules: కార్తీకమాసంలో ఎలాంటి నియమాలను పాటించాలి.. ఏం తినాలి? ఏం తినకూడదో మీకు తెలుసా?

Kartik Month Food Rules

Kartik Month Food Rules

ప్రస్తుతం కార్తీకమాసం కావడంతో ఆలయాలు అలాగే హిందువుల ఇల్లు దీపాల వెలుగులతో మెరిసిపోతున్నాయి. అదేవిధంగా ఆలయాలన్నీ పంచాక్షరి అష్టక్షరి మంత్రాలతో మారుమోగుతున్నాయి. ఇక ఈ కార్తీకమాసంలో నదీ స్నానాలు ఆచరించి కార్తిక దీపాలను వెలిగిస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నెలలో బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి పుణ్యస్నానం నుంచి దీపం, ఉపవాసం వరకూ పాటించే ప్రతి నియమం వెనుకా ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. శీతాకాలం ఆరంభంలో వచ్చే నెల కావడంతో ఆరోగ్యంగా ఉండేందుకు అలవాట్లలో చాలా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. మరీ ఈ మాసంలో ఏం తినాలో, ఏ తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కార్తీకమాసంలో నెలరోజుల పాటు మాంసాహారానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. అయితే చలికాలంలో మార్పుల కారణంగా కేవలం మనిషి శరీరంలో మాత్రమే కాకుండా జంతువుల శరీరంలో కూడా అనేక రకాల మార్పులు వస్తాయి. వాటిని తినడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయట. ముఖ్యంగా జీర్ణక్రియ ప్రక్రియ బలపడుతుందని చెబుతున్నారు. కాబట్టి కార్తీక మాసంలో కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా మంచి జరగాలంటే మాంసాహారాన్ని తీసుకోకపోవడం మంచిదని చెబుతున్నారు. అదేవిధంగా ఈ మాసంలో ఫ్రిజ్లో పెట్టిన ఆహార పదార్థాలు కూల్ డ్రింక్స్ చల్లటి నీళ్లు వంటివి తినకపోవడం మంచిదని చెబుతున్నారు. కార్తీక మాసంలో వాతావరణం ఎక్కువ శాతం చల్లగా ఉంటుంది.

కాబట్టి ఇలాంటి చల్లటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా ఆస్తమా లాంటి శ్వాశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు చల్లటి పదార్ధాలు, పానీయాలకు దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు. అలాగే చేదు నిండిన కూరగాయలను ఈ నెలలో తీసుకోపోవడమే మంచిదని చెబుతున్నారు. కాకరకాయ, చేదు పొట్లకాయ లాంటి కూరలు వండుకోవద్దు. చేదు విత్తనాల్లో బ్యాక్టీరియా తొందరగా ఫామ్ అవుతుంది. వాటిని తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది లేదంటే వివిధ రకాల వ్యాధులకు దారితీయవచ్చట. అలాగే గోరువెచ్చని పాలు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పాలలో బెల్లం వేసుకొని తాగడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. స్వీట్లు, షుగర్ సంబంధిత పదార్థాలకు దూరంగా ఉండడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే బెల్లం ఎంత తీసుకుంటే అంత మంచిదట. శరీరంలో ఆరోగ్యకరమైన వెచ్చదనాన్ని పెంచడంతో పాటూ రక్తపోటుని నియంత్రిస్తుందట.

కాలుష్యం కారణంగా దగ్గు, జలుబు నుంచి శరీరాన్ని సురక్షితంగా ఉంచేందుకు బెల్లం సహకరిస్తుందని చెబుతున్నారు. అలాగే వాతావరణంలో ఉండే చల్లదనం ప్రభావం మీ శరీరంపై చూపించకుండా ఉండాలంటే బెల్లంతో పాటూ నల్ల ఉప్పు వినియోగించండి. ఈ రెండింటి మిశ్రమాన్ని రాత్రి సమయంలో తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందట. కార్తీక మాసంలో దీపాలు వెలిగించేందుకు గోధుమ పిండి వినియోగిస్తారు. గోధుమ పిండితో తయారు చేసిన ప్రమిదలు కొందరు తింటారు. గోధుమ పిండితో హల్వా, చలిమిడి చేసి నివేదిస్తారు. ఈ నెలలో గోధుమ పిండితో తయారుచేసిన పదార్థాలు తీసుకుంటే శరీరం వెచ్చగా ఉంటుందట.