Vastu and Turtle: తాబేలుని ఆ దిశలో ఉంచితే మీ ఇంట్లో డబ్బులే డబ్బులు!

హిందువులు తాబేలును విష్ణుమూర్తి ప్రత్యేకగా భావిస్తారు. శ్రీ మహావిష్ణువు కుర్మావతారంలో వచ్చి తన అద్భుతమైన మహిమలను చూపాడు అని శాస్త్రాల్లో చెప్పబడింది.

  • Written By:
  • Publish Date - September 17, 2022 / 10:33 PM IST

హిందువులు తాబేలును విష్ణుమూర్తి ప్రత్యేకగా భావిస్తారు. శ్రీ మహావిష్ణువు కుర్మావతారంలో వచ్చి తన అద్భుతమైన మహిమలను చూపాడు అని శాస్త్రాల్లో చెప్పబడింది. అయితే వాస్తు శాస్త్ర ప్రకారం తాబేలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయని, అలాగే సంపద పెరుగుతుంది అని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇది ఒకవేళ తాబేలు కానీ తాబేలు బొమ్మలను ఇంట్లో పెట్టుకునేవారు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి అని వాస్తు శాస్త్రాన్ని పనులు చెబుతున్నారు.

వాటి పట్ల అశ్రద్ధ వహిస్తే ఆనందానికి బదులుగా ఇంట్లో ఇబ్బందులు ఎదురవుతాయి అని చెబుతున్నారు.. వాస్తు శాస్త్ర ప్రకారం తాబేలు పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు ఏ దిశలో పెట్టుకోవాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో సానుకూల శక్తి ప్రభావం పెరగాలంటే అందుకోసం సరైన రోజు, సరైన దిశలో తాబేలును ఉంచాలి. ముఖ్యంగా పౌర్ణమి రోజున మీ ఇంట్లోకి తాబేలును తీసుకురావడం మంచిది. పౌర్ణమి రోజున తాబేలును కాసేపు పాలలో ఉంచి అభిజిత్ ముహుర్తంలో, ఈ తాబేలును పాలలో నుంచి తీసి, నీటితో శుభ్రం చేయాలి.

ఆ తర్వాత ఒక పాత్రలో కొద్దిగా నీరు తీసుకుని తాబేలును ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రసారమవుతుందట్. అలాగే తాబేలు నీటిలో నివసించే జంతువు కాబట్టి, అది ఉండే పాత్రను నీటి దిశలోనే ఉంచాలి. అనగా తాబేలును ఈశాన్య దిశలో ఉంచిన తరువాత ఓం శ్రీం కూర్మై నమః అనే మంత్రాన్ని 11సార్లు జపించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఇంట్లో తాబేలును ఉంచేటప్పుడు దాని నోరు లోపల ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. తాబేలు నోరు బయటకు వచ్చిన ముఖాన్ని ఇంట్లో ఎప్పటికీ ఉంచుకోవద్దు. ఇలా చేయడం వల్ల మీకు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి తాబేలును ఇంట్లో ఉంచడం వల్ల మీ కుటుంబంలో గొడవలు, అశాంతి, ఆర్థిక పరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.