Vastu Tips for Confidence: వాస్తు ప్రకారం ఈ పనులు చేస్తే మీరు జీవితంలో విజయం సాధించడం గ్యారెంటీ!

జీవితంలో ఎవరైనా మంచి సక్సెస్ ను సాధించాలి అంటే ఆత్మవిశ్వాసం చాలా అవసరం. ఆత్మవిశ్వాసం లేకపోతే మీరు

  • Written By:
  • Publish Date - August 26, 2022 / 08:25 AM IST

జీవితంలో ఎవరైనా మంచి సక్సెస్ ను సాధించాలి అంటే ఆత్మవిశ్వాసం చాలా అవసరం. ఆత్మవిశ్వాసం లేకపోతే మీరు ఎంత కష్టపడి పనిచేసిన కూడా విజయం సాధించలేరు. విజయం సాధించకపోవడంతో ముఖ్య కారణం మీలో ఆత్మ విశ్వాసం లేకపోవడమే. అయితే వాస్తవానికి, ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించాలి అంటే అతనికి ఆత్మవిశ్వాసం ఉండాలి. ఒకవేళ మీరు ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లు భావిస్తే మీరు వాస్తు సహాయం పొందవచ్చు. అయితే వాస్తుశాస్త్రం వ్యక్తి విశ్వాసాన్ని పెంచే కొన్ని నిర్దిష్ట పరిష్కారాలను సూచిస్తుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చేపలను పెంచడం..వాస్తు ప్రకారం మీ ఇంటి కిటికీలను తెరవండి. ఇలా చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ బదిలీ అవుతుంది. అలాగే వాస్తు ప్రకారం చేపలను ఇంట్లో ఉంచండం మంచిది. అందులో కనీసం రెండు గోల్డ్ కలర్ ఫిష్‌లు ఉండాలి. వాటికి మనం క్రమం తప్పకుండా ఆహారం తినిపించండం వల్ల అది మన ఆత్మవిశ్వాసాన్ని కొంత వరకు పెంచుతుంది అని చెప్పవచ్చు. అలాగే పక్షులకు ఆహారం పెట్టండి. అలాగే మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి కొన్ని జ్యోతిష్య పరిష్కారాలను కూడా ప్రయత్నించవచ్చు. పక్షులకు ఆహారం ఇవ్వడం మరియు నీరు పెట్టడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని నమ్ముతారు. అందువల్ల, మీరు మీ ఇంటి పైకప్పుపై పక్షి దాణాను క్రమం తప్పకుండా ఉంచాలి. అలాగే అవి త్రాగడానికి నీటిని నిల్వ చేయాలి. అలాగే ఇంట్లో శని యంత్రాన్ని ఉంచుకోంవాలీ. అదేవిధంగా మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు మరియు పచ్చి మిరపకాయలను వేలాడదీయండి.

నిమ్మకాయ ఎండిన తర్వాత, శనివారం దానిని తీసివేసి, కొత్తదాన్ని భర్తీ చేసి తాజాగా ఉంచండి. ఉదయాన్నే లేచి ఉదయించే సూర్యుడిని ఆరాధించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తరచుగా ఆదిత్య హృదయ స్తోత్రం చెప్పడం,ప్రతిరోజూ ఉదయం సూర్యునికి నీటిని సమర్పించాలి. అలాగే భోజనం చేసేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చోవాలి. అలాగే ఉదయాన్నే గాయత్రీ మంత్రాన్ని జపించండి. మీ లివింగ్ రూమ్‌ను ఉదయించే సూర్యుడి చిత్రంతో లేదా పరుగెత్తే గుర్రంతో అలంకరించాలి. అలాగే ఎప్పుడు కూడా ఖాళీ గోడకు ఎదురుగా కూర్చోవద్దు. అది మీ ఆత్మ విశ్వాసాన్ని నాశనం చేస్తుంది. ముఖం లేదా 11 ముఖ రుద్రాక్ష ధరించడం అనేది విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ సమర్థవంతమైన మార్గం.