Site icon HashtagU Telugu

Vastu Tips: ఇంటి గోడలపై ఇలాంటి కనిపిస్తే అంతే సంగతులు.. అవేంటంటే?

Vastu Tips For Walls

Vastu Tips For Walls

Vastu Tips: వాస్తు శాస్త్ర ప్రకారం గా కేవలం ఇంటి నిర్మాణం విషయంలోనే కాకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు విషయంలో కూడా వాస్తు చిట్కాలను పాటించాల్సిందే అని అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. వాస్తు శాస్త్రవేకారంగా ఇంట్లో వస్తువులు ఉండటం వల్ల ఆ ఇంట్లో అనుకూల శక్తి ప్రవాహం పెరుగుతుందట. అయితే కేవలం ఇంట్లో ఉన్న వస్తువులు మాత్రమే కాకుండా ఇంటి గోడలు తలుపులు కూడా వాస్తు ప్రకారంగా లేకపోతే అది చెడు ప్రభావాన్ని చూపిస్తుందట.

ఇంటి గోడల నుండి కనిపించే అలాంటి కొన్ని సంకేతాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించేటప్పుడు ఇంటి గోడలు ఎత్తు ఇంటిని ప్రధాన ద్వారం ఎత్తు కంటే మూడు వంతులు ఎక్కువగా ఉండాలట. అలాగే ఇంటి పశ్చిమ, దక్షిణ దిక్కుల గోడల ఎత్తు ఉత్తర, తూర్పు దిక్కుల గోడల కంటే కనీసం 30 సెం.మీ ఎత్తులో ఉండాలట. అలాగే ఎప్పుడూ కూడా ఇంటి గోడలను శుభ్రంగా ఉంచుకోవాలి.

ఇంటి గోడల పై బూజీ ఉండడం, గోడలు మురికిగా ఉండడం వల్ల ప్రతికూల శక్తిని పెంచుతాయి. ఇంటి గోడలపై ఎలాంటి మరకలు ఉండకూడదని, అవి ఇంట్లో పేదరికాన్ని వ్యాపింపజేస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి లోపల గోడలపై ఉండే రంగులకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఇంటి గోడల రంగులు నలగకుండా చూసుకోవాలి. దీని వల్ల కుటుంబ సభ్యులకు సమస్యలు వ్యాధులు కూడా వస్తాయట.

Exit mobile version