Vastu Tips: చాలామంది ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో డబ్బులు నిలబడటం లేదు అని బాధపడుతూ ఉంటారు. అంతే కాకుండా ఎంత సంపాదించినా కూడా నిలవడం లేదని అప్పులు కూడా చేస్తూ ఉంటారు. అందుకోసం ఎన్నో రకాల వాస్తు చిట్కాలను నియమాలను పాటించిన కూడా ఫలితం కనిపించకపోయేసరికి తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. అయితే అటువంటివారు వాస్తు శాస్త్రం ద్వారా ఆ ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చట. అదిలాగో ఇప్పుడు మనం తెలుసుకున్నాం.. ఇంట్లో కొన్ని రకాల మొక్కలను నాటడం వల్ల శుభం కలుగుతుంది.
కాకుండా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మరి ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం కోసం ఎటువంటి మొక్కలు నాటాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంటి లోపల లేదా ఇంటి బయట గాని మనీ ప్లాంట్ ను నాటడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే శమీ వృక్షాన్ని ఇంటి ప్రధాన ద్వారం ఎడమ వైపు నాటాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లోని వారికి ఎప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇంటి ప్రధాన ముఖ ద్వారం కుడివైపున దానిమ్మ మొక్కను నాటడం వల్ల వారికీ అదృష్టం పెరుగుతుందట.
అంతే కాకుండా దానిమ్మ చెట్టును నాటడం వల్ల లక్ష్మీ దేవిని , కుబేరుడుని ఆకర్షించి సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుందట. శివునికి ఎంతో ఇష్టం అయిన బిల్వపత్ర మొక్కను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నాటాలి. ఈ విధంగా చేయడం వల్ల అనవసరపు ఖర్చులు తగ్గి డబ్బులు ఆధార అవడంతో పాటు ఆర్థిక సమస్యలు ఉంటే దూరం అవుతాయి. ఇంటి వెనుక అరటిపండు, ఇంటి ముందు బిల్వ పత్ర మొక్క ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.