Vastu Tips : ఇంట్లోని ఈ స్థలంలో డబ్బును దాచుకుంటే కోటీశ్వరులు అవ్వడం ఖాయం..!!

వాస్తు ప్రకారం...ఇంట్లో ఉండే ప్రతిదీ ఖచ్చితంగా జీవితంపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

  • Written By:
  • Publish Date - September 14, 2022 / 06:09 AM IST

వాస్తు ప్రకారం…ఇంట్లో ఉండే ప్రతిదీ ఖచ్చితంగా జీవితంపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వ్యక్తి పురోగతి, ఆరోగ్యం, వాటిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే వస్తువు ప్రతీది కూడా సరైన స్థలంలో ఉంచడం ముఖ్యం. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఇంట్లో ఎల్లప్పుడు సంతోషం ఉంటుంది. అదేవిధంగా వాస్తు ప్రకారం డబ్బు లేదా నగలు లేదా విలువైన ఇతర వస్తువులు ఇంట్లో ఏదొక ప్రదేశంలో ఉంచాలి. ఇంట్లో ఏ స్థలంలో ఉంచాలి..ఏ దిక్కున ఉంచాలి. ఎలాంటి ప్రయోజనం ఉంటుంది. ఇవన్నీ తెలుసుకుందాం.

ఉత్తర దిశలో ఉంచండి:
సంపదకు దేవుడు అయిన కుబేరస్వామి ఉత్తర దిక్కున ఉంటారు. వాస్తు ప్రకారం మీరు విలువైన వస్తువులను ఉంచే నగదు పెట్టె లేదా ఆల్మారా ఎప్పుడూ కూడా ఉత్తరదిశలోనే ఉండాలి. ఈ దిశలో ఉంచితే అదృష్టంతోపాటు సంపద రెట్టింపు అవుతుందని నమ్ముతుంటారు.

బీరువా తలుపు దక్షిణం వైపు తెరువవద్దు:
బీరువాను ఉత్తరదిశలో ఉంచండి. కానీ దాని తలుపు దక్షిణం వైపు చూడకూడదని గుర్తుంచుకోండి. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి దక్షిణం నుంచి ప్రయాణించి ఉత్తరాన స్థిరపడుతుందని నమ్ముతుంటారు. కాబట్టి ఈ దిశలో తలుపు తెరిచినట్లయితే…డబ్బు ఖర్చు అవుతుంది.

ఈ దిశలో ఉంచండి:
కొన్ని కారణాల వల్ల మీరు ఉత్తరం వైపున ఉంచనట్లయితే..తూర్పు దిశలో ఉంచండి. ఈ దిశ డబ్బుకు శుభప్రదంగా పరిగణించబడుతుంది. డబ్బు పెట్టే నైరుతి దిశలో ఉంటే…ఎడమ వైపు, తూర్పు ముఖంగా ఉంటే…కుడివైపు ఉంచాలి.

ఈ దిశలలో ఉంచవద్దు:
వాస్తు ప్రకారం, అల్మారాను మూలకు ఉంచకూడదు. ముఖ్యంగా ఈశాన్యం, ఆగ్నేయం లేదా నైరుతి మూలలో ఉంచకూడదు. దక్షిణ దిశలో కూడా ఉంచకూడదు. ఇలా చేస్తే దురదృష్టాన్ని తెస్తుంది. డబ్బు వృధాగా ఖర్చు అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.