Vastu Tips: ఇంట్లో ఈ ప్రదేశంలో అద్దాన్ని పెడితే పట్టిందల్లా బంగారమే!

Vastu Tips: హిందూ శాస్త్రం ప్రకారం వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో విశ్వసిస్తారు అందుకే మనం చేసే ప్రతి పనిలోనూ మనం నిర్మించే, అలంకరించే ప్రతి ఒక్క వస్తువు విషయంలోనూ వాస్తును తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటారు.

  • Written By:
  • Publish Date - September 19, 2022 / 07:45 AM IST

Vastu Tips: హిందూ శాస్త్రం ప్రకారం వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో విశ్వసిస్తారు అందుకే మనం చేసే ప్రతి పనిలోనూ మనం నిర్మించే, అలంకరించే ప్రతి ఒక్క వస్తువు విషయంలోనూ వాస్తును తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటారు. ప్రతి ఒక్కటి వాస్తు శాస్త్రం ప్రకారం అలంకరించుకుంటే ఇంట్లో ఆనందంతో పాటు శ్రేయస్సు, ఆర్థికాభివృద్ధి కూడా ఉంటాయి. అద్దం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.అయితే మన ఇంట్లో అద్దం ఏ ప్రదేశంలో పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

పడక గదిలో అద్దం ఉండడం వాస్తు శాస్త్రం ప్రకారం ఎంతో మంచిది. అయితే మనం పడుకున్న తర్వాత మన శరీర భాగాలన్నీ అద్దంలో కనిపించే విధంగా అర్థం పెట్టకూడదు. అలాగే బాత్రూంలో అద్దం ఎప్పుడూ కూడా ఉత్తరం లేదా తూర్పు గోడపై అమర్చాలి. అయితే బాత్రూంలో అద్దం బిగించిన తర్వాత అద్దం మూలంలో లైట్ ఉంచడం ముఖ్యం. చీకటిలో అద్దం ఉండడం ఆశుభానికి సంకేతం.

మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు అద్దం పెట్టడం ఎంతో ముఖ్యం. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి అద్దం పెట్టడం వల్ల ఏ విధమైనటువంటి ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు. అయితే ప్రధాన ద్వారం వద్ద అద్దం అమర్చేవారు చతురస్రం లేదా దీర్ఘచతురస్రాకార అద్దాన్ని పొందడం సముచితంగా ఉంటుంది. ఇలా పెట్టడం వల్ల మన ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించదు. చిన్నపిల్లల గదిలో అద్దం ఉంచడం సానుకూల వాతావరణాన్ని కలిగిస్తుంది అలాగే స్టడీ టేబుల్ లేదా వర్క్ టేబుల్ పై అద్దం ఉంచడం వల్ల మనం పనులు చేసుకుంటున్న సమయంలో సానుకూల శక్తిని ప్రతిబింప చేస్తుంది.