Site icon HashtagU Telugu

Vastu Tips: ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందట!

Vastu Tips

Vastu Tips

సాధారణంగా ఇంటిని వాస్తు ప్రకారంగా నిర్మిస్తూ ఉంటారు. అలాగే ఇంటి నిర్మాణానికి వాస్తు అన్నది కూడా చాలా ముఖ్యం. లేదంటే సుఖ సంతోషాలు ఉండకపోగా ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాగే కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యం పాలవుతూనే ఉంటారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు తలెత్తి ఇంట్లో దరిద్రం తాండవం ఆడుతుంది. అందుకే ఎవరైనా సరే కొత్త ఇంటి నియమించినప్పుడు వారికి ఉన్నంతలో అయినా కూడా వాసు నియమాలను పాటించి గృహ నిర్మాణం చేసుకోవాలి. ఇప్పట్లో అయితే చాలామంది తెలిసి తెలియక కట్టిన ఇంటిని కూల్చివేసి మరి వాస్తు ప్రకారంగా కడుతున్నారు.

మరి అదృష్టం కావాలంటే ఎలాంటి వాస్తు చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాస్తు ప్రకారంగా మొదటగా ప్రవేశ ద్వారం అనగా ముఖ ద్వారం ఎప్పుడు శుభ్రంగా అందంగా ఉండాలి. అదేవిధంగా ముఖద్వారం తెరిచిన తర్వాత ఎప్పుడూ కూడా పగలగొట్టడం లాంటి శబ్దాలు చేయకూడదు. అలాగే ప్రవేశ ద్వారం ధ్వంసం అయితే వెంటనే తయారు చేయాలి. గడప ముందు బూట్లు, చెప్పులు ఉండకూడదు. అలాగే ఇంటిలో కూజా, గాజు వస్తువులు ఉంచకూడదు. ఇది ఒక రకమైన వాస్తు లోపంగా చెప్పవచ్చు. వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి.

అలాగే మనం ఇంట్లో వంట చేసేటప్పుడు ముఖం తూర్పు వైపునకు ఉండేలా చూసుకోవాలి. రాత్రి 8 గంటలకు ముందుగానే దుస్తులు మార్చుకోవడం లాంటివీ చేయాలి. మురికి దుస్తులతో ఉతికిన దుస్తులను ఎప్పుడూ కలపకూడదు. సూర్యోదయానికి ముందు మీ ఇంటిని శుభ్రపరచడం, తుడుచుకోవడం చేయాలి. ఇంటి గదుల్లో ఎక్కువ చిత్రాలు పెట్టకూడదు. ఒకటి లేదా రెండు ముఖ్యమైన ఫోటోలు మాత్రమే ఉండాలి. ఇంటి లోపల ఈశాన్య దిశలో ప్రార్థనా స్థలం ఉండాలి.

Exit mobile version