Site icon HashtagU Telugu

Vinakaya chavithi 2024: గ్రహదోషాల నుంచి విముక్తి పొందాలంటే ఈ గణపతిని పూజించాల్సిందే!

Vinakaya Chavithi 2024

Vinakaya Chavithi 2024

మామూలుగా ప్రతి ఒక వ్యక్తి జాతకరీత్యా జీవితంలో ఏదో ఒక సమయంలో గ్రహదోషాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ గ్రహ దోషాలు ఉన్నప్పుడు కొన్నిసార్లు శుభ, అశుభ ఫలితాలు కూడా కలుగుతూ ఉంటాయి. అశుభ ఫలితాలు కలిగినప్పుడు అష్ట కష్టాలు పడుతూ ఉంటారు. ఈ ఫలితాల నుంచి బయటపడడం కోసం అనేక రకాల మార్గాలను అనుసరిస్తూ ఉంటారు. మీరు కూడా అలా గ్రహ దోషాల నుంచి విముక్తి పొందడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారా. మీ జాతకంలో కూడా గ్రహదోషాలు ఉన్నట్లయితే ఈ వినాయక చవితికి విఘ్నేశ్వరుడిని పూజించాలట. మరి వినాయక చవితి రోజు గణేష్ ని ఎలా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జాతకంలో సూర్య దోషం ఉండడం వల్ల వృత్తి కెరీర్లో ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని అధిగమించేందుకు మీరు ఎర్రచందనంతో చేసిన వినాయకుడిని పూజించాలట. ఇలా చేయడం వల్ల దోషం తొలగిపోవడంతో పాటు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. అదేవిధంగా జాతకంలో జాతకంలో చంద్రుడు స్థానం బలహీనంగా ఉన్నట్లయితే వినాయక చవితి రోజు పాలరాయి లేదా వెండితో చేసిన వినాయకుడిని పూజించాలట. ఇలా చేయడం వల్ల చంద్ర దోషం తొలగిపోతుందని చెబుతున్నారు. జాతకంలో కుజదోషము ఉన్నప్పుడు వివాహంలో అలాగే వైవాహిక జీవితంలో అనేక అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. వాటి నుంచి బయటపడాలంటే వినాయక చవితి రోజు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయట.

జాతకంలో బుధ గ్రహ దోషం వెంటాడుతున్నట్లయితే మీరు వినాయక చవితి రోజు మరకత గణపతిని ఆరాధించాలని పండితులు చెబుతున్నారు. అలాగే గురు దోషం నుంచి బయటపడేందుకు పసుపుతో చేసిన గణపతిని పూజించాలట. అలాగే చందనం లేదా బంగారంతో చేసిన వినాయకుడిని పూజించినా విశేష ఫలితం లభిస్తుందని చెబుతున్నారు. జాతకంలో శుక్ర దోషం ఉన్నట్లయితే సంపద వృద్ధి తక్కువగా ఉంటుందట. ఆదాయ స్థాయిలు అనుకూలంగా ఉండకపోవచ్చని చెబుతున్నారు. అందువల్ల ఈ దోషాన్ని నివారించేందుకు స్పటిక గణపతిని ఆరాధన చేయాలట.

ఇక జాతకంలో శని దోషం ఉన్నట్లయితే నల్ల రాయిపై చెక్కిన వినాయకుని చవితి రోజు పూజించాలని చెబుతున్నారు. నీడ గ్రహమైన రాహు దోషం జాతకంలో ఉన్నట్లయితే అనేక కష్టాలు వెంటాడుతాయట. ఈ దోష నివారణ కోసం మట్టితో చేసిన గణపతిని పూజించాలని చెబుతున్నారు. మరో నీడ గ్రహమైన కేతు గ్రహ దోషము జాతకంలో ఉన్నట్లయితే మీరు వినాయక చవితి రోజు తెల్ల జిల్లేడు పూలతో వినాయకుడిని పూజించాలి. ఇలా చేయడం వల్ల మీకు ఈ దోషం నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు.

Exit mobile version