Site icon HashtagU Telugu

Vastu Tips: మీ ఇంటి నుంచి దరిద్రం వెళ్లిపోవాలంటే.. ఇలా చేయాల్సిందే?

Badluck

Badluck

చాలామంది జీవితంలో ఎంత సంపాదించినా కూడా డబ్బులు చేతుల్లో నిలబడడం లేదని, ఆర్థిక సమస్యలు కూడా వెంటాడుతున్నాయని బాధపడుతూ ఉంటారు. అయితే కొంతమంది ఎన్ని పూజలు చేసినా కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతున్నాయి అని చింత పడుతూ ఉంటారు. మరి దరిద్రం ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అంటే అందుకోసం ఏం చేయాలి. ఈ దేవుడిని ఆరాధించాలి. ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం కనకధారా స్తోత్రం పఠించాలి.

దీని అర్థం ఏమిటంటే లక్ష్మి,నారాయణ లను కలిపి పూజించడం ద్వారా అక్కడ బంగారు వర్షం కురుస్తుంది. మరి ఆ కనకధార స్తోత్రం పఠించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. భార్య, భర్తలు అనుకూలంగా జీవిస్తారు. అలాగే ఆర్థికంగా కూడా లోటు లేకుండా ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి భావనలు కూడా ఏర్పడతాయి. అలాగే ఈ కనకధార స్తోత్రం తో అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించడం వల్ల మనకు అనుకూలమైన ఫలితాలు సంభవిస్తాయి. మన ప్రతి రోజే పూజించే లక్ష్మీదేవి ఎలా అయితే మనకు కనిపిస్తుందో అదే విధంగా ఆ అమ్మవారి రూపాన్ని తలుచుకుంటూ అమ్మ నీకు బంగారు వర్షాన్ని బిక్షంగా సమర్పించుకుంటున్నాను.

అంటూ అమ్మవారిపై బంగారు వర్షాలు కురిపించిన భావన చేస్తే మనకు సంపదకు లోటు ఉండదు. ఆరోగ్యానికి లోటు ఉండదు. ఆయుర్దాయానికి లోటు ఉండదు. కాబట్టి చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు అలాగే ఇంత సంపాదించినా కూడా డబ్బు నిలవడం లేదు అని బాధపడుతున్న వారు కనకధారా స్తోత్రం పటిస్తూ అమ్మవారి రూపాన్ని మన మనసులో తలుచుకొని పూజించాలి.