Hanuman: ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా అలాంటి తప్పులు అస్సలు చేయకండి?

హిందువులు ఎక్కువగా ఆరాధించే దేవుళ్ళలో హనుమంతుడు కూడా ఒకరు. ప్రతి మంగళవారం శనివారం రోజు హనుమంతుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - December 3, 2023 / 06:15 PM IST

హిందువులు ఎక్కువగా ఆరాధించే దేవుళ్ళలో హనుమంతుడు కూడా ఒకరు. ప్రతి మంగళవారం శనివారం రోజు హనుమంతుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాలలో అయితే ప్రతి ఒక్క ఊరికి తప్పనిసరిగా ఆంజనేయస్వామి ఆలయం ఉంటుంది. ఆయనని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ధైర్యాన్ని ప్రసాదిస్తాడని, కోరిన కోరికలను నెరవేరుస్తాడని విశ్వసిస్తూ ఉంటారు. అందుకే భక్తులు ప్రతి మంగళవారం అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామిని విశేషంగా పూజిస్తూ ఉంటారు. బ‌లానికి, ధైర్యానికి ప్ర‌తీక‌గా ఆంజ‌నేయ స్వామిని పూజిస్తూ ఉంటారు. అయితే ఆంజ‌నేయ స్వామి ఎక్కడ కొలువై ఉంటాడో అక్క‌డ శ్రీ రామచంద్రులు తప్పకుండా కొలువై ఉంటారని భక్తులు భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆంజనేయస్వామి ని పూజించడం వల్ల శ్రీరాముడి అనుగ్రహం కూడా తప్పక కలుగుతుంది.

ఆంజ‌నేయడు బ్ర‌మ్మ‌చార్యుడుగా ఉండిపోయాడు. హ‌నుమంతుడు శ్రీ రామ భ‌క్తుడిగా , శ్రీ రామ బంటుడిగా, శ్రీ రామ దాసిగా, భ‌క్తితో ప‌ర‌వ‌శ‌మై ఉంటాడు. భ‌క్తుల కోరిక‌ల‌ను తిర్చే భ‌గ‌వంతుడైన ఆంజ‌నేయడు కొరిన వ‌రాల‌ను ఇస్తాడు. అయితే కొందరు ఆంజనేయ స్వామిని ఇంట్లో పూజించడంతోపాటు ఆంజ‌నేయ దేవాల‌యాలకు వెళ్ళిన‌ప్పుడు కాని, ద‌ర్శించుకొనేట‌ప్పుడు కాని , కొన్ని పోర‌పాట్లు కూడా అస‌లు చేయ‌కూడ‌దు. మరి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆంజ‌నేయ స్వామి దేవాల‌యంకు వెళ్ళిన్న‌ప్పుడు మ‌నం కొన్ని ఆచారాల‌ను పాటించాలి. సాధార‌ణంగా మ‌నం ఏ దేవాల‌యానికి వెళ్ళినా స‌రే అక్క‌డ మ‌నం కేవ‌లం మూడు ప్ర‌ద‌క్ష‌ణ‌లే చేస్తూ ఉంటాము. అయితే ఆంజ‌నేయ స్వామి గుడికి వెళ్ళిన్న‌ప్పుడు మాత్రం ఐదు ప్ర‌ద‌క్ష‌ణ‌లు చేయాలి. పోర‌పాటున కూడా మూడు ప్ర‌ద‌క్ష‌ణ‌లు చేయ‌కూడ‌దు.

అలాగే ఆంజ‌నేయ స్వామి గుడి చుట్టూ ప్ర‌ద‌క్ష‌ణ‌లు చేసే స‌మ‌యంలో భ‌క్తులు శ్రీ హ‌నుమాన్, జ‌య హ‌నుమాన్..జ‌య జ‌య హ‌నుమాన్ అనే శ్లోకం చ‌దువుతూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా ఆంజనేయ స్వామి పేరుని స్మరిస్తూ ప్రదక్షిణలు చేయడం వల్ల స‌క‌ల రోగాల‌ను, భూత ప్రేతాల పీశాచాది, ఎటువంటి బాద‌ల నుండి అయినా మ‌న‌లను ఎల్ల‌ప్పుడు ర‌క్షిస్తూ హ‌నుమాన్ మ‌న వెనువెంటే ఉంటాడు. కావునా భ‌క్తులు 5 ప్ర‌ద‌క్ష‌ణ‌లు చేస్తే త‌మ కొరిక‌లు తిర‌డ‌మే కాక‌,కష్టాల నుంచి బాద‌ల నంచి విముక్తి పోంద‌వచ్చు.. కొందరు భ‌క్తులు త‌మ కోరికల మేర‌కు స్వామివారి ఆల‌యం చుట్టూరా 108 ప్ర‌ద‌క్ష‌ణ‌లు చేస్తూంటారు. అయితే ఒకే రోజు 108 ప్ర‌ద‌క్ష‌ణ‌లు చేయ‌డానికి వీలు కుదరని వారు 54, 27 ప‌ర్యాయాలు లెక్కన ప్రదక్షిలు చేయవచ్చు. అలాగే ఆంజ‌నేయ స్వామిని ముటుకోవ‌ద్దు అని బ్ర‌హ్మ‌నులు అంటుంటారు. కొంత‌మంది భ‌క్తులు హ‌నుమానుని పై భూజాల మీద ఉన్న సిందూరం కోసం, మ‌రి కొంద‌రు ఆంజ‌నేయ స్వామి వారి పాదాల‌ను తాకాల‌ని న‌మ‌స్క‌రించాల‌ని, ప్ర‌య‌త్నం చేస్తారు. అలా పాదాల‌కు న‌మ‌స్క‌రించ‌కూడ‌దు. ఎందుకంటే స్వామి వారు త‌మ కాళ్ళ పాదాల క్రింద భూత ప్రేతాల పీశాచాది ల‌ను అణ‌చి వేశాడు. కావున ఎటువంటి ప‌రిస్తితిలో అయినా స్వామి వారి పాదాలకు న‌మ‌స్క‌రించ‌కూడ‌దు.

అంతే కాదు ఆంజ‌నేయ స్వామి వారికి పూజకు సంబ‌ధిత వ‌స్తువుల‌ను పూజారి చేతుల‌మిదుగా అందించాలి. కాని స్వామి వారిని భ‌క్తులు తాక‌రాదు. అలాగే ఆంజనేయ స్వామి మూల విరాట్ ని తాకరాదు. ముఖ్యంగా స్త్రీలు ఆంజ‌నేయ స్వామి వారిని అస‌లు తాక‌రాదు. భ‌యిష్టు స‌మ‌యంలో భ‌యిష్టు ముగిసిన 7 రోజుల త‌రువాత మాత్ర‌మే ఆంజ‌నేయ స్వామి ద‌ర్శించుట‌కు ఆల‌యంలోకి వెళ్ళాలి. భ‌యిష్టు స‌మ‌యంలో వెళ్లినా కూడా కాని ఆయ‌న‌ను తాకితే మ‌హ‌పాపం త‌గులుతుంది. ఎందుకంటే ఆంజ‌నేయ స్వామి బ్ర‌మ్మ‌హ‌చ‌ర్యం పాటించ‌డం వ‌ల‌న మ‌హిళ‌లు తాక‌రాదదు.