Shanidev Blessings: సుఖసంతోషాలు అష్టైశ్వర్యాలు కావాలా.. అయితే శని దేవుని ఈ విధంగా పూజించాల్సిందే?

Shanidev Blessings: చాలామంది శనీశ్వరుడు పేరు వినగానే భయపడిపోతూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది శని దేవుడిని పూజించాలి అన్న కూడా భయపడుతూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా వారి జాతకంలో శని దేవుని ప్రభావం ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - October 11, 2022 / 08:30 AM IST

Shanidev Blessings: చాలామంది శనీశ్వరుడు పేరు వినగానే భయపడిపోతూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది శని దేవుడిని పూజించాలి అన్న కూడా భయపడుతూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా వారి జాతకంలో శని దేవుని ప్రభావం ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు. అయితే శనీశ్వరుని చూసి భయపడి పూజ చేయకుండా ఉండే వారి కంటే పూజ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు. అయితే ప్రతి ఒక్కరూ శనీశ్వరుడు యందు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం శని దేవుడిని ఎప్పుడు శని అని పిలవకూడదు. శనీశ్వర లేదా శనీశ్వరుడు అని మాత్రమే పిలవాలి. ఎక్కడ అయితే ఈశ్వర శబ్దం వినిపిస్తుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది.

అందుకే శనీశ్వరుడి నామంలో కూడా శని,ఈశ్వరుడు అనే శబ్దం రావడం వల్ల శివుడిలా అలాగే వెంకటేశ్వర స్వామీల మనల్ని శనీశ్వరుడు కూడా అనుగ్రహిస్తాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎప్పుడు శనీశ్వరుడికి భయపడాల్సిన అవసరం లేదు. నవగ్రహ మండపానికి వెళ్ళినప్పుడు శనీశ్వరుడికి భక్తితో నమస్కారం చేయడం, శనివారం నియమాలు పాటించడం, నీలం లేదా నలుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల, ఆరాధన చేయడం వల్ల శనీశ్వరుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఎవరైతే శనీశ్వరుడి ని భక్తితో పూజించి గౌరవిస్తారో అటువంటి వారిని శనీశ్వరుడు అనుగ్రహిస్తాడట. అదేవిధంగా ఎప్పుడు కూడా శనీశ్వరుడి పీడ రావాలి అని కోరుకోవాలట. ఎందుకంటే శనీశ్వరుడు పీడించాడు అంటే దానికి 100 రెట్లు యోగాన్ని ఐశ్వర్యాన్ని అందిస్తాడట.

అలా కోరుకోకపోతే ఆయన ఇచ్చే యోగం ఐశ్వర్యం కూడా రాదట. అందుకే శనీశ్వరుని పీడించాలి దానికి 100 యోగాన్ని ఐశ్వర్యాన్ని కలిగించాలి అంటూ భక్తిశ్రద్ధలతో ఆయనని కోరుకోవాలట. ఇందుకోసం చక్కగా నీలిరంగు పుష్పాలతో పూజించి శివారాధన, హనుమాన్, అయ్యప్ప ఆరాధన చేయడం మంచిది. అయితే శనిశ్వరుడి పీడ తగిలినప్పుడు మొదట్లో కొంచెం ఇబ్బందులు ఎదురైనా ఆ తర్వాత అంతకుమించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు ఆటంలో ఎటువంటి సందేహం లేదు. అంతే కాకుండా శనీశ్వరుడిని పూజించే సమయంలో కొన్ని రకాల నియమాలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అందులో మొదటిది పూజ చేసేటప్పుడు శని దేవుని వైపు చూడకూడదు. శని దేవునికి ఎదురుగా నిలబడి చూడకూడదు. కలలో కళ్ళు పెట్టి చూడకూడదు. శనీశ్వరుని పాదాలను మాత్రమే పూజించాలి. శనీశ్వరునితో పాటు ఆంజనేయస్వామి పూజ పూజించడం మంచిది.