Shani Dosha: ఈ పనులు చేస్తే శని దోష నివారణె కాదు ఐశ్వర్యవంతులు అవ్వొచ్చు!

Shani Dosha: శని దేవుడిని కర్మ ఫలదాత అంటారు.శని ఎవరిపై అంటే వారిపై తన ప్రభావాన్ని చూపించరు ఎవరైతే కర్మలు చేసే ఉంటారు వారి ఖర్మకు అనుగుణంగా ఫలితాలను అందిస్తూ ఉంటారు.

Published By: HashtagU Telugu Desk
shani

shani

Shani Dosha: శని దేవుడిని కర్మ ఫలదాత అంటారు.శని ఎవరిపై అంటే వారిపై తన ప్రభావాన్ని చూపించరు ఎవరైతే కర్మలు చేసే ఉంటారు వారి ఖర్మకు అనుగుణంగా ఫలితాలను అందిస్తూ ఉంటారు. ఇలా శని ప్రభావం మన పై పడితే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా మనం చేసే పనులలో ఆటంకాలు ఏర్పడటం, అందరి చేత అవమానాలు పడటం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవడం జరుగుతుంది. ఇలా శని ప్రభావంతో బాధపడేవారు ఈ చిన్న పరిహారాలు చేయటం వల్ల శని ప్రభావం నుంచి బయటపడవచ్చు.

శనీశ్వరునికి ఎంతో ప్రీతికరమైన రోజు శనివారం. అందుకే శనివారం రోజున శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల శని ప్రభావ దోషం నుంచి బయటపడవచ్చు. శని ప్రభావం పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి పై పడదు కనుక వీరిని పూజించిన శని ప్రభావం నుంచి బయటపడవచ్చు. అలాగే శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం హనుమంతుడు శివుడు మరియు అశ్వర్థ వృక్షాన్ని పూజించడం వల్ల శని సంబంధిత దోషాలు తొలగిపోతాయి.

ప్రతి శనివారం శని చాలీసా చదవడంతో పాటు ‘ఓం ప్రాం ప్రమ్స్: శనైశ్చరాయ నమః’ రుద్రాక్ష మాలతో ఈ మంత్రాన్ని చదవటం వల్ల శని ప్రభావం తొలగిపోతుంది. ఈ పరిహారాలతో పాటు ఆవనూనెతో శివుడికి అభిషేకం చేయడంవల్ల శని దోష నివారణ జరగడంతో పాటు ఆ ఇంట్లో సిరిసంపదలు అష్టైశ్వర్యాలు వెల్లువిరుస్తాయి. అలాగే శనివారం రోజున నల్లటి వస్త్రాలు నల్లటి నువ్వులు నువ్వుల నూనెను దానధర్మం చేయటం వల్ల ఈ శని దోషం నుంచి బయటపడవచ్చు.

  Last Updated: 18 Sep 2022, 10:35 PM IST