Shani Dev: ఈ ఏడు ఉపాయాలు పాటిస్తే శనిదేవుని కృపతో మీకు రాజయోగమే?

Shani Dev: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శనీశ్వరుడిని న్యాయ దేవుడుగా పిలుస్తారు. శనీశ్వరుడు వారి కర్మలను బట్టి శుభా, అశుభ ఫలితాలను ఇస్తారని చెబుతూ ఉంటారు. శనీశ్వరుడి అనుగ్రహం ఉన్నవారు రాజయోగం

  • Written By:
  • Publish Date - October 22, 2022 / 06:30 AM IST

Shani Dev: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శనీశ్వరుడిని న్యాయ దేవుడుగా పిలుస్తారు. శనీశ్వరుడు వారి కర్మలను బట్టి శుభా, అశుభ ఫలితాలను ఇస్తారని చెబుతూ ఉంటారు. శనీశ్వరుడి అనుగ్రహం ఉన్నవారు రాజయోగం పొందుతారని, శని దేవుని కోపానికి కారకులైన వారు అష్టకష్టాలను అనుభవిస్తారని చెబుతూ ఉంటారు. అలాగే శని దేవుడు ఎంత కష్టపెడితే అంతకు రెండింతలు మంచి ఫలితాలను ఇస్తారని కూడా చెబుతూ ఉంటారు. మరి శనీశ్వరుడి కృప మీపై ఉండాలి అంటే కొన్ని రకాల నియమాలను పాటించాలి. ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మీ శని గ్రహం బలహీనంగా ఇంటే అలాంటప్పుడు మీరు కనీసం 19 శనివారాలు అయిన ఉపవాసం ఉండాలి. లేదంటే 51 శనివారాలు ఉపవాసం ఉండవచ్చు. అలాగే శనివారం రోజున నల్లని వస్త్రాలు ధరించి ఓం ప్రాం ప్రిం ప్రూన్స్: శనయే నమః అనే మంత్రాన్ని కనీసం 5 సార్లు జపించాలి. ఈ విధంగా 11 లేదా 19 రోజులు కూడా చేస్తే తప్పకుండా శని కృప మనకు లభిస్తుంది. అదేవిధంగా శనివారం రోజున ఉసిరితో చేసిన కుడుములను సేవించాలి. అలాగే ఆవనూనెలో చేసిన ఆహారపదార్థాలు కూడా తినాలి. ఇవన్నీ కూడా శని గ్రహాన్ని బలపరుస్తాయి. అలాగే శని వారం రోజున మీరు అరటిపండును పండ్లు తినడం వల్ల శని కృప తప్పక లభిస్తుంది.

శని దేవుని కృప తప్పక ఉండాలంటే దుప్పట్లు, పాదరక్షలు, చెప్పులు, ఇనుము, నల్లని వస్త్రాలు, కొబ్బరినూనె దానం చేయాలి. శనివారం ఆవనూనె, గేదె, నల్ల ఆవును దానం చేయడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. జాతకంలో శని బలహీనంగా ఉన్న వారు నీలమణి ని ధరించాలి. నీలమణి సాధ్యం కానీ వారు జమునియా నీలి, బ్లాక్ అఖీఖ్, లజ్వర్త, శని ఉపరత్నా లను కూడా ధరించవచ్చు. ఇది కూడా శని గ్రహాన్ని బలపరుస్తుంది. అలాగే ఎప్పుడు పరాయి స్త్రీల తో సంబంధాలు పెట్టుకోకూడదు. అహంకారం ఉండకుండా పేద, నిస్సహాయులకు సహాయం చేయాలి. తక్కువ స్థాయి వాళ్ళను అయిన సరే మర్యాదతో మాట్లాడించాలి. శనిని బలోపేతం చేయడం కోసం శని దేవ్, హనుమంతుడిని,శివుడిని పూజించాలి.