Site icon HashtagU Telugu

Lakshmi Devi: లక్ష్మీదేవికి ఈ నైవేద్యాన్ని సమర్పిస్తే చాలు.. అదృష్టం పట్టిపీడించడం ఖాయం?

Varalaxmi Vratham 2023

Lakshmi Devi

మామూలుగా కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలకపోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందని తెగ బాధపడుతూ ఉంటారు. ఇంత పొదుపుగా వాడుకున్న కూడా డబ్బులు అయిపోతున్నాయని దిగులు చెందుతూ ఉంటారు.. ఈ క్రమంలోనే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఆర్థిక సమస్యలు తొలగిపోవడం కోసం డబ్బులు చేతిలో నిలబడడం కోసం అనేక రకాల పూజలు పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అయితే ఆర్థికంగా స్థిరపడాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలి. కనుక సంపద వృద్ధి చెంది ఆర్థికంగా స్థిరపడాలంటే లక్ష్మీదేవికి ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆర్థిక పరిస్థితిలు మెరుగుపడాలన్న డబ్బులు చేతిలో నిలవాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఆమెను భక్తిశ్రద్ధలతో పూజించడంతో పాటు ఆమెకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం వల్ల ఆమె అనుగ్రహం మరింత తొందరగా లభిస్తుంది. ఇందుకోసం సోమవారం రోజున తలస్నానం చేసి సూర్యోదయం సమయంలో అంటే 6 నుంచి 7 గంటలలోపు పెరుగును చెక్క కవ్వంతో చిలికి వెన్నెను తీయాలి. పెరుగును చిలకడానికి చెక్క కవ్వన్నీ మాత్రమే ఉపయోగించాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. ఇలా తయారు చేసుకున్న వెన్న పాడవ్వకుండా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి.

శుక్రవారం రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకుని లక్ష్మీదేవి పూజ చేయాలి. ఇలా చేసే లక్ష్మీదేవి పూజలో సోమవారం చిలికి తయారుచేసుకున్న వెన్నకు పొడి చేసుకున్న పటిక బెల్లాన్ని కలిపి నైవేద్యంగా లక్ష్మీదేవికి సమర్పించాలి. పూజ అయిపోయాక ఈ నైవేద్య వెన్న ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న పిల్లలకు తినిపించాలి. ఇలా 11 వారాల పాటు చేస్తే లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది. అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. దీంతో సంపాదించిన ధనం నిల్వ ఉంటుంది. అనవసరపు ఖర్చులు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. సంపాదించిన ధనం జాగ్రత్తగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు మంచి ఫలితాలను పొందగలరు. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. రావలసిన డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది.