Site icon HashtagU Telugu

Goddess Lakshmi: వెన్న పటిక బెల్లంతో లక్ష్మీదేవి నైవేద్యం పెడితే.. మీ ఇంట్లో డబ్బే డబ్బు!

Lakshmi Devi

Lakshmi Devi

చాలామంది ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో నిలబడడం లేదు అని బాధపడుతూ ఉంటారు. ఖర్చులు ఎంత తగ్గించుకున్నా కూడా డబ్బులు ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతుంది,ఆర్థికంగా నష్టపోతున్నాము అని బాధపడుతూ నిరాశ చెందుతూ ఉంటారు. అయితే లైఫ్ లో ఆర్థికంగా బాగా స్థిరపడాలి అన్న, డబ్బులు బాగా సంపాదించాలి అన్న మనపై తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. మరి డబ్బులు నిలబడాలి అంటే లక్ష్మీదేవికి ఏ విధంగా పూజ చేయాలి ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలామంది లైఫ్ లో బాగా స్థిరపడాలని కష్టపడి డబ్బు సంపాదించినప్పటికీ అనుకోని విధంగా డబ్బులు ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతూ ఉండడంతో వాళ్ల కష్టానికి తగిన ఫలితం లభించదు. దాంతో వారు ఎంత సంపాదించినా కూడా నిరాశ చెందుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే డబ్బు నిలవకపోవడానికి అనారోగ్య సమస్యలు కూడా ముఖ్య కారణం అని చెప్పవచ్చు. కనుక ఆరోగ్యంగా ఉండాలి అన్నా సంపాద నిలవాలి అన్న లక్ష్మీదేవిని తప్పకుండా పూజించాలి. లక్ష్మీదేవిని పూజించి ఆమె అనుగ్రహం పొందడం వల్ల ఆర్థికంగా, ఆరోగ్యకరంగా బాగా ఉందిఅనవసరపు ఖర్చులు కూడా తగ్గుతాయి.

మరి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సోమవారం రోజున తల స్నానం చేసి సూర్యోదయం సమయంలో అనగా ఆరు నుంచి ఏడు గంటలలోపు పెరుగు చెక్క కవ్వంతో చిలికిన వెన్నను తీయాలి. పెరుగును చిలక డానికి చెక్క కవ్వం ని మాత్రమే ఉపయోగించాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతాం. అలా తయారు చేసుకున్న ఆ వెన్నని పాడవకుండా జాగ్రత్తగా భద్ర పరుచుకోవాలి. శుక్రవారం రోజు ఉదయాన్నే తల స్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకొని లక్ష్మీదేవి పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న ఆ వెన్నలో పొడి పట్టిక బెల్లాన్ని కలిపి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేసిన తర్వాత ఆ వెన్న నైవేద్యాన్ని ఇంట్లో ఉన్న పిల్లలకు తినిపించాలి. ఇలా 11 వారాలు చేయడం వల్ల లక్ష్మీదేవి సంతృప్తి చెంది మనపై అనుగ్రహిస్తుంది.

Exit mobile version