Site icon HashtagU Telugu

Lakshmi Devi: లక్ష్మీదేవికి ఈ నైవేద్యాన్ని సమర్పిస్తే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే?

Mixcollage 30 Jun 2024 08 48 Am 1451

Mixcollage 30 Jun 2024 08 48 Am 1451

మామూలుగా చాలామంది ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లి గవ్వకూడా మిగలడం లేదని బాధపడుతూ ఉంటారు. ఖర్చులు ఎంత తగ్గించుకున్నప్పటికీ డబ్బు ఏదో ఒక విధంగా వృధా అయిపోతుంది అని దిగులు చెందుతూ ఉంటారు. అయితే ఆర్థికంగా స్థిరపడాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై తప్పకుండా ఉండాలి. కనుక సంపద వృద్ధి చెంది ఆర్థికంగా స్థిరపడాలంటే లక్ష్మీదేవికి ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలో అలాగే ఇలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మనకు జీవితంలో ఆర్థిక సమస్యలు ఉండకూడదు అంటే లక్ష్మి అనుగ్రహం తప్పనిసరి. అమ్మవారి అనుగ్రహం లభిస్తే చాలు ఎంతటి బీదవారైనా సరే కోటీశ్వరులు అవ్వాల్సిందే. దానికి తోడు ఏదో ఒకటి అనారోగ్య సమస్యలు మొదలవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆరోగ్యంగా ఉండాలన్నా సంపద చేతిలో నిలవాలి అన్న లక్ష్మీదేవిని తప్పకుండా పూజించాలి. అందుకోసం సోమవారం రోజున తల స్నానం చేసి సూర్యోదయం సమయంలో అంటే ఆరు నుంచి ఏడు గంటలలోపు పెరుగును చెక్క కవ్వంతో చిలికి వెన్నను తీయాలి. ఇలా తయారు చేసుకున్న వెన్నను పాడవకుండా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి.

శుక్రవారం రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకుని లక్ష్మీదేవి పూజ చేయాలి. ఇలా చేసే లక్ష్మీదేవి పూజలో సోమవారం చిలికి తయారుచేసుకున్న వెన్నకు పొడి చేసుకున్న పటిక బెల్లాన్ని కలిపి నైవేద్యంగా లక్ష్మీదేవికి సమర్పించాలి. పూజ అయిపోయాక ఈ నైవేద్య వెన్న ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న పిల్లలకు తినిపించాలి. ఇలా 11 వారాల పాటు చేస్తే లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది. ఆమె అనుగ్రహం తప్పకుండా మనకు కలుగుతుంది. దీంతో సంపాదించిన ధనం నిల్వ ఉంటుంది. అనవసరపు ఖర్చులు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

సంపాదించిన ధనం జాగ్రత్తగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు మంచి ఫలితాలను పొందగలరు. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. రావలసిన డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది. అలాగే శుక్రవారం నియమాలను కూడా పాటించాలి. శుక్రవారం రోజున గోర్లు, వెంట్రుకలను కత్తిరించుకోవడం చేయరాదు. అలాగే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇతరులకు డబ్బు ఇవ్వరాదు. అయితే హాస్పిటల్లకు, విద్యా సంస్థలకు ఈ నియమం వర్తించదు. మాసిన బట్టలను ముట్టుకోవడం, ఉతకడం చేయరాదు. ఇంట్లో ఉన్న ఆడపిల్లలను సంతోషంగా ఉంచాలి. భక్తిశ్రద్ధలతో నియమనిష్ఠలతో లక్ష్మీదేవిని పూజించాలి.