Evil Eye: నరదృష్టి తొలిగిపోవాలంటే ఈ చిట్కాలు తప్పక పాటించండి!

సాధారణంగా మనకి ఎప్పుడైనా కానీ తలనొప్పిస్తోంది లేదంటే కడుపునొస్తోంది, వాంతులు అవుతున్నాయి అంతే మన

  • Written By:
  • Publish Date - August 9, 2022 / 04:31 PM IST

సాధారణంగా మనకి ఎప్పుడైనా కానీ తలనొప్పిస్తోంది లేదంటే కడుపునొస్తోంది, వాంతులు అవుతున్నాయి అంతే మన పెద్దలు దిష్టి తగిలిందేమో అని అంటూ ఉంటారు. అలా దిష్టి తగిలినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దిష్టిని తీస్తూ ఉంటారు. అలాగే వ్యాపారం చేసే వారికి ఏదైనా సమస్యలు ఎదురైనా లేదంటే వ్యాపారం తగ్గిపోయిన నర దిష్టి తగిలింది అని అంటూ ఉంటారు. అయితే చాలామంది ఈ నరదిష్టి తొలగిపోవాలి అని ఎన్నో రకాల పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ నరదృష్టి అనేది చాలా భయంకరమైనదని, ఆ నరదృష్టి తగిలితే ఎటువంటి వారు అయినా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే అని నమ్ముతూ ఉంటారు. మరి ఆ నరదృష్టి పీడ తొలగిపోవాలి అంటే ఎటువంటి పరిష్కారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

నరదృష్టి తొలగిపోవాలి అంటే వారానికి ఒకసారి మనం స్నానం చేసే నీటిలో ఉప్పుని వేసుకుని ఆ నీటితో స్నానం చేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది. ఇలా చేయడం వల్ల నరదిష్టి పీడ తొలగిపోయి, శారీరక అలసట కూడా ఉండదు. అలాగే సోమరితనం కూడా పరారవుతుంది. అయితే ఇలా పుట్టినరోజు నాడు లేదంటే మంగళవారం స్నానం చేసే నీటిలో ఉప్పు వేసుకొని వాటితో స్నానం చేయాలి. అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవు. అలాగే వ్యాపారాలు చేసే చోట కంటి ద్రుష్టి తొలగిపోవాలి అంటే నిమ్మ పండు ని సగానికి కోసి దానికి కుంకుమ బొట్టు పెట్టి వ్యాపారం చేసే చోట వాకిలికి ఇరువైపులా పెట్టాలి. ఇలా మంగళవారంనాడు చేయడం వల్ల కంటి దృష్టి తొలగిపోతుంది. అలాగే అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిధుల్లో ఉదయం సాయంత్రం పూట సాంబ్రాణి వేయడం మంచిది.

పచ్చ కర్పూరం,కస్తూరి పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంట్లో అలాగే వ్యాపారం చేసే చోట చల్లడం వల్ల కంటి దృష్టి తొలగిపోతుంది. అలాగే ఆదాయం లభిస్తుంది. ఒకవేళ రుణ బాధలు ఉంటే వినాయక స్వామి ఆలయంలో అర్చన చేయడం మంచిది. అలాగే కుల దైవ పూజ చేయాలి. వినాయకుడికి అర్చన చేసిన కొబ్బరికాయలోని నీటిని తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వు నన్ను నూనె పోసి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉండడంతో పాటు ఈతి బాధలు తొలగిపోతాయి. అలాగే శుక్ల పక్షంలో వచ్చే శని ఆదివారాల్లో సముద్ర తీరానికి వెళ్లి ఆ నీటిలో పసుపు కలిపి ఆ నీటిని ఇంట్లో కార్యాలయంలో చల్లుకోవాలి.