Shani Remedies: ఆస్ట్రాలజీ ప్రకారం శని దేవుని సడేసతి ప్రతి ఒక్క వ్యక్తి జీవితం పై సంవత్సరాలు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యక్తి జాతకంలో అయితే శని బలంగా ఉంటాడో అతనికి శుభ ఫలితాలు వస్తాయి. అలాగే ఈ వ్యక్తి జాతకంలో శని బలహీనంగా ఉంటాడో ఆ వ్యక్తి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాగా శని సడేసతి సమయంలో ఎటువంటి పనులు చేయకూడదు. వాటి కోసం ఎటువంటి పరిహారాలను పాటించాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కాగా ఏ వ్యక్తి జాతకంలో అయినా శని సడేసతి నడుస్తున్నట్లయితే.. వారు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. శని సడేసతి సమయంలో ఒంటరిగా కాకుండా ఎవరితో అయినా కలిసి ప్రయాణించడం మంచిది. అలాగే శనివారం రోజున నలుపు రంగు బట్టలు, తోలు వస్తువులు కొనుగోలు చేయకూడదు. ఈ విధంగా చేయడం వల్ల మీ జాతకంలో శనిగ్రహం మరింత బలహీన పడుతుంది. మద్యం సేవించ కూడదు అలాగే తప్పుడు పనులకు దూరంగా ఉండాలి.
శని సడే సతిపరిహారాల విషయానికి వస్తే.. శనివారం శని దేవుడిని పూజించడం వల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది.అలాగే ఆపదలో ఉన్నవారికి తప్పకుండా సహాయం చేయండి. వీలైనంత వరకు శనికి సంబంధించిన వస్తువులను దానం చేయడం వల్ల మంచి. అలాగే శని బలపడాలంటే కుడిచేతి మధ్య వేలికి గుర్రపు డెక్కతో తయారు చేయబడిన ఉంగారాన్ని ధరించండి. ప్రతి శనివారం శని దేవుడికి రాగి మరియు నువ్వుల నూనెను సమర్పించండి. శనివారం శని స్తోత్రాన్ని పఠించాలి. అదేవిధంగా శనివారాల్లో లేదా క్రమం తప్పకుండా కాకులకు, చీమలకు ఆహారం పెట్టండి.