Vastu Tips:  ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారా.. అయితే ఈ వాస్తు చిట్కాలను పాటించాల్సిందే?

ఇంటికి వాస్తు అన్నది చాలా ముఖ్యం. ప్రస్తుత రోజుల్లో అయితే చాలామంది ఈ వాస్తు శాస్త్ర ప్రకారంగా ఇంటిని నిర్మించుకుంటున్నారు. అయితే కేవలం సొంతింటికి మాత్రమే కాకుండా, ఇల్లు అద్దెకి తీసుకోవాలి అనుకుంటున్నా ఇంట్లో కూడా వాస్తు విషయాలను పాటించాలట.

  • Written By:
  • Publish Date - September 23, 2022 / 06:45 AM IST

ఇంటికి వాస్తు అన్నది చాలా ముఖ్యం. ప్రస్తుత రోజుల్లో అయితే చాలామంది ఈ వాస్తు శాస్త్ర ప్రకారంగా ఇంటిని నిర్మించుకుంటున్నారు. అయితే కేవలం సొంతింటికి మాత్రమే కాకుండా, ఇల్లు అద్దెకి తీసుకోవాలి అనుకుంటున్నా ఇంట్లో కూడా వాస్తు విషయాలను పాటించాలట. అయితే అద్దె ఇంట్లో ఉంటే వాస్తు అన్నది గృహ యజమానికి మాత్రమే వర్తిస్తుందా అంటే యజమానితో పాటు ఆ ఇంట్లో అద్దెకి ఉన్న వారిపై కూడా వాస్తు ప్రభావం పడుతుంది. కాబట్టి అద్దె ఇంట్లో ఉండేటప్పుడు ఎటువంటి వాస్తు జాగ్రత్తలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మొదటగా మనం అద్దెకు తీసుకోవాలి అనుకుంటున్నా ఇల్లు వీధి ఏ దిశలో ఉందో గమనించుకోవాలి. అలాగే ఆ ఇల్లు వీధి వాలు విధానం అనగా రోడ్డు ఎత్తు పల్లాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అలాగే మనం ఇంటిని అద్దెకు తీసుకునే ముందు మనం ఏ పని మీద ఇంటిని అద్దెకు తీసుకుంటున్నాం అన్న విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. విద్యార్థులు అద్దె రూమ్ తీసుకుంటే తూర్పు,,ఉత్తర గృహాలను మాత్రమే తీసుకోవాలి. అంటే తూర్పు నుంచి ఉత్తరానికి, ఉత్తరం నుంచి తూర్పు కీ నడక సాగే విధంగాఉండే ఇంటిని అద్దెకి తీసుకోవాలి.
అలాగే ఆగ్నేయ భాగంలో పడకగది ఉండకూడదు. నైరుతిలో ఎప్పుడు బాత్రూం ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే దక్షిణ మధ్య భాగంలో కిటికీ ఉన్న ఇంటిని తీసుకోకూడదు. అలాగే ముఖ్యంగా వీధి చివరన ఉన్న గృహాన్ని అద్దెకి తీసుకోకూడదు. అలాగే స్మశానానికి దగ్గరగా ఉండే ఇంటిని అద్దెకు తీసుకోకూడదు. అలాగే ఇంటికి దగ్గరలో పాదరక్షల దుకాణం ఉంటే ఇంటిని అద్దెకు తీసుకోవచ్చు. లిఫ్ట్ ఎదురుగా మెట్లు ఎదురుగా ఉన్న ఇంటిని తీసుకోకూడదు. అలాగే మసీదు దేవాలయాలు చర్చికి దగ్గరగా ఉన్న గృహాలను తీసుకోకూడదు.