Astro Tips: దురదృష్టం వెంటాడుతోందా.. అయితే ఈ పనులు చేస్తే చాలు లక్ష్మీ మీ వెంటే?

జ్యోతిష్య శాస్త్రంలో కష్టాల నుంచి గట్టెక్కడానికి, ఆర్థిక పరిస్థితులను దూరం చేసుకోవడానికి, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం,

  • Written By:
  • Publish Date - January 13, 2023 / 06:00 AM IST

జ్యోతిష్య శాస్త్రంలో కష్టాల నుంచి గట్టెక్కడానికి, ఆర్థిక పరిస్థితులను దూరం చేసుకోవడానికి, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, అనుకున్న పనులు సక్సెస్ అవ్వడానికి ఇలా అనేక విషయాల గురించి పరిహారాలు చెప్పబడిన విషయం తెలిసిందే. చెప్పబడిన ఆ పరిహారాలు పాటించడం ద్వారా ఆ సమస్యల నుంచి ఈజీగా గట్టెక్కవచ్చు అంటున్నారు నిపుణులు. మీకు ఒకవేళ దురదృష్టం వెంటాడుతుంటే అటువంటప్పుడు ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీరు ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే కొబ్బరికాయ తలపై పచ్చకర్పూరం పెట్టి వెలిగించి 21 సార్లు దిష్టి తీసుకొని ఆ తరువాత ఆ కొబ్బరి కాయను ప్రవహించే నీటిలో విడిచిపెట్టాలి.

అయితే ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు తీస్తున్నప్పుడు వేర్వేరు కొబ్బరికాయలను ఉపయోగించాలి. ఏడాదికి రెండు సార్లు ఇలా చేస్తే మీకు మంచి సత్ఫలితాలు లభిస్తాయ్. అయితే ఈ పరిహారం కేవలం మంగళ వారం, గురువారం అలాగే శనివారాల్లో మాత్రమే చేయాలి. అలాగే శనీశ్వరుని నిత్యం పూజించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. అదేవిధంగా ఇంట్లో పాడైపోయిన గడియారం లేదా పగిలిన గాజును ఉంచకూడదు. అలాగే ఇంట్లో ఫిష్ అక్వేరియం ఉంచండి. ప్రతి రోజు ఆవుకు ప్రతిరోజు గడ్డి తినిపిస్తే చాలా మంచిది. అలాగే శనీశ్వరునికి సంబంధించిన ఏవైనా దోషాలు ఉంటే అటువంటప్పుడు కనీసం పదిమంది అందులకు ఆహారం ఇస్తే శని దోషం తొలగిపోతుంది.

అలాగే వికలాంగులకు సన్యాసికి పేదవారికి అన్నం పెట్టడం వల్ల మంచి ఫలితాలు కనిపించడంతోపాటు ఆర్థిక బలం చేకూరుతుంది. తరచుగా ఇలా చేయకపోయినా సంవత్సరానికి రెండు సార్లు ఇలా చేసినా శని దేవుని అనుగ్రహం లభిస్తుంది. పక్షులకు ఆహారం ఇవ్వడం ఎంతో అదృష్టం. ఇంటి బాల్కనీలో పక్షులకు ఆహారం నీరు ఉంచడం మంచిది. దీంతో ఏ పక్షి కూడా ఆకలితో ఉండదు. ఇలా చేయడం వల్ల సకల సమస్యలు తొలిగిపోయి మంచి ఫలితాలు కనిపిస్తాయి. మూగజీవాలకు ఆహారం పెట్టకపోయినా పర్లేదు కానీ వాటికి హాని తలపెట్టకుండా ఉంటే చాలు.