కొంతమందికి ఇంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. దాంతో ఏం చేయాలో తెలియక చాలామంది తెగ ఆలోచిస్తూ ఉంటారు. డబ్బులు చేతిలో నిలవడం కోసం రకరకాల పూజలు పరిహారాలు దాని ధర్మాలు వంటివి చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే ఖర్చు అవుతూ ఉంటుంది. చేతిలో మాత్రం చిల్లిగవ్వ కూడా మిగలదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తే మన చేతిలో డబ్బు నిలువ ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చాలామంది డబ్బు విషయంలో తెలిసి తెలియక డబ్బు తప్పులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల కూడా లక్ష్మీదేవికి కోపం వస్తూ ఉంటుంది. అలా మనం చేసి చిన్న చిన్న పొరపాట్లు కొన్నిసార్లు మనం ఎదుర్కొనే ఆర్థిక సమస్యలకు కూడా కారణం కావచ్చు. అయితే ఇలా డబ్బు సమస్యలు రాకుండా ఉండాలి అంటే చేతిలో డబ్బు పట్టుకుని కొన్ని విషయాలు స్మరించుకోవాలని చెబుతున్నారు. ఇంతకీ ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నాకు డబ్బు పుష్కలంగా ఉంది. నాకు ఇష్టమైన వాటికి డబ్బును ఖర్చు పెడతాను. నాకు ఊహించిన, ఊహించని మార్గాలలో డబ్బు వస్తుంది. నేను నా జీవితంలో డబ్బును సంతోషంగా ఆకర్షిస్తాను. నేను కోరుకున్న సంపదకు నేను అర్హుడను. నా జీవితంలో డబ్బు నిరంతరం ప్రవహిస్తుంది. కాబట్టి నేను రుణ విముక్తుడను. నా దగ్గర ఉన్న డబ్బుకు నేను కృతజ్ఞుడను అని చెప్పాలి. ఈ విధంగా డబ్బులు చేతిలో పట్టుకొని పైన చెప్పిన విషయాలు చెప్పడం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుందట. అంతేకాకుండా డబ్బులు కూడా ఎల్లప్పుడూ మీ వద్ద ఉంటాయని చెబుతున్నారు.