Site icon HashtagU Telugu

Saturday: శని దోషం తొలగిపోవాలంటే శనివారం ఈ పరిహారాలు పాటించాల్సిందే?

Mixcollage 15 Dec 2023 05 21 Pm 6488

Mixcollage 15 Dec 2023 05 21 Pm 6488

శనివారం శనీశ్వరుడికి అంకితం చేయబడింది. ఇక శనివారం రోజున శని దేవున్ని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది. శనిదేవుని అనుగ్రహం వల్ల జీవితంలో ఎలాంటి సమస్య రాదని నమ్ముతారు. శనివారం నాడు నిర్మలమైన మనస్సుతో శనైశ్చ‌రుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అలాగే శని దోషం తొలగిపోవాలి అన్న కూడా శనివారం కొన్ని రకాల పరిహారాలు పాటించాల్సిందే. మరి ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శనివారం ఉపవాసం ఉండేవారు శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉపవాసానికి ముందు ఒక రోజు మాంసం, మద్యం లేదా తామసిక ఆహారాన్ని తీసుకోకూడదు.

ఇది మీ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీరు శని భగవానుని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే లేదా శని అనుగ్రహం పొందాలనుకుంటే ఈ పని తప్పకుండా చేయాలి. అలాగే శనివారం స్నానం చేసిన తర్వాత శని దేవుడిని పూజించాలని తీర్మానం చేయాలి. ఈ రోజు మీరు స్నానం చేసిన తర్వాత, రావి చెట్టుకు నీరు సమర్పించి, ప్రదక్షిణలు చేసి శని దేవుని పూజించాలి. ఆ తరువాత వికసించిన చెట్టు చుట్టూ 7 సార్లు దారం చుట్టి పూజ చేయాలి. శనివారం నాడు పుష్పించే చెట్టును పూజించడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది. అలాగే శనివారం రోజు ప్రతి ఒక్కరు మనసు, మాట, చేతలలో స్వచ్ఛంగా ఉండాలి. మీరు శనివారం ఉపవాసం ఉంటే ఈ రోజు పండ్లు తినాలి. అలాగే శనిదేవుని కథలను వినాలి.

శనివారం వ్రత కథను పఠించడం లేదా వినడం ద్వారా శని దేవుడు త్వరగా సంతోషిస్తాడు. ఈ సాయంత్రం శని దేవుడికి హారతి ఇవ్వాలి. శనిని ప్రసన్నం చేసుకోవడానికి, శనిదేవుని ఇనుప విగ్రహాన్ని శనివారం పూజించాలి. అలాగే శని దేవుడికి ఇష్టమైన నల్ల నువ్వులు, ఆవనూనె, నల్లని వస్త్రాలు సమర్పించాలి. ఈ రోజు దుప్పటి దానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. దీని వల్ల మీ శని దోషం కూడా తొలగిపోతుంది. అలాగే శని అనుగ్ర‌హం, శని గ్ర‌హ‌ శాంతి కోసం శనివారం నాడు శనిదేవుని మంత్రం, శ్లోకం చదవాలి. ఈ రోజున చిటికెడు ఎర్రచందనం నీటిలో కలిపి స్నానం చేయడం చాలా శుభప్రదం. శని గ్రహం దుష్ప్రభావాల నుంచి బయటపడటానికి, శని విగ్ర‌హాన్ని శనివారం దానం చేయాలి. మీరు శనివారం ఉపవాసం ఆచరిస్తే మరుసటి రోజు శని దేవుడిని పూజించిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమించాలి. ఈ నియ‌మాన్ని పాటించిన‌ తర్వాత మాత్రమే ఉపవాసం సంపూర్ణంగా పరిగ‌ణించాలి.