Dhanteras2022 : ధన్‌తేరస్‌లో చీపురు కొనాలనుకుంటున్నారా? అయితే పొరపాటు అస్సలు చేయకండి..!!

హిందువులు దీపావళి పండగను ఐదురోజులపాటు కన్నులపండువగా జరుపుకుంటారు.

  • Written By:
  • Publish Date - September 17, 2022 / 08:15 PM IST

హిందువులు దీపావళి పండగను ఐదురోజులపాటు కన్నులపండువగా జరుపుకుంటారు. ఈ పండుగ ధంతేరస్ తో మొదలైన..భాయ్ దూజ్ తో ముగుస్తుంది. చాలామంది ధంతేరస్ కు షాపింగ్ చేస్తుంటారు. ఈ రోజు బంగారం, వెండితోపాటు కొన్ని విలువైన ప్రత్యేక వస్తువులు కొనుగోలు చేస్తారు. ధంతేరస్ రోజుల్లో బంగారం కొనుగోలు చేస్తే…లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుందని డబ్బుకు ఎలాంటి కొరత ఉండదని నమ్ముతుంటారు.

జ్యోతిష్యశాస్త్రంలో ధన్‌తేరస్‌ రోజు చీపురు కొనుగోలు చేస్తే అదృష్టం వరిస్తుందని పేర్కొనబడింది. ధన్‌తేరస్‌ రోజుల్లో చీరుపు కొనుగోలు చేస్తే ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. అయితే కొత్త చీపురు కొనే ముందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎల్లప్పుడూ కొలువై ఉంటుంది.

ధన్‌తేరస్‌లో చీపురు ఎందుకు కొనాలి:
ఈరోజు బంగారంతోపాటు కొత్త చీపురు కొంటుంటారు. ఎందుకంటే చీరుపును లక్ష్మీదేవికి చిహ్నంగా పరిగణిస్తారు. ఇంట్లోకి కొత్త చీరుపు తీసుకువస్తే…ఆ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లుగా భావిస్తుంటారు. ఈ రోజు కొత్త చీపురు కొనడమే కాదు దానికి పూజలు కూడా చేస్తారు.

ధన్‌తేరస్‌ రోజున పాత చీపురు విషయంలో పొరపాటున ఈ పనులు చేయకండి:
ధన్‌తేరస్‌ రోజు మీరు కొత్త చీపురును కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చాక…పాతచీపురును పొరపాటున కూడా బయట పాడేయకండి. ఎందుకంటే పాతచీపురును బయట పడేస్తే…లక్ష్మీదేవిని బయటకు పంపించినట్లవుతుంది. ఇలా చేస్తే మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. పాతచీపురుకు కుంకుమ, అక్షింతలతో పూజించండి. కొత్తచీపురును పూజిస్తూ ఇంటి శ్రేయస్సు కోసం ప్రార్ధించండి.

ఇక పాతచీపురుకు నల్లదారాన్ని కట్టి…ఎవరూ చూడని ప్రదేశంలో ఉంచండి. ఇది మీ ఇంటిని ప్రతికూల శక్తి నుంచి రక్షిస్తుంది. నిజానికి చీపురు శుక్రుని చిహ్నంగానూ..నల్ల దారాన్ని శని గ్రహంగానూ పరిగణిస్తుంటారు. కాబట్టి చీపురుకు నల్లదారాన్ని కట్టి ఉంచడం శుభప్రదంగా చెబుతుంటారు. అయితే పాతచీపురును మంచి కింద లేదంటే వంటగదిలో ఉంచాలి. ధంతేరష్ రోజు కొత్త చీపురుకు పూజ చేసి వాడండి.

ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి:
ఇంట్లో విరిగిపోయిన చీపురు ఉంచకూడదు. అలా ఉంచితే ఇంట్లో ప్రతికూల శక్తిని కలిగిస్తుంది. పాతచీపురును శనివారం లేదా అమావాస్యనాడు మాత్రమే ఇంటినుంచి బయట వేయాలి. చీపురు పాదాలు తాకని ప్రదేశంలో ఉంచాలి. చీపురును బయటి వ్యక్తులు చూడకూడదు.

ఎలాంటి చీపురు కొనాలి:
జ్యోతిష్యం ప్రకారం…ధంతేరస్ రోజున కొబ్బరి లేదా పువ్వుతో చేసిన చీపురు కొనుగోలు చేయాలి. విరిగిన లేదా తేలికగా ఉన్న చీపురును కొనకూడదు. చీపురు ఎప్పుడూ కూడా నేలపై పడకూడదు. చీపురుపై ఎట్టిపరిస్థితుల్లోనూ కాలుతో తాకకూడదు. అలా చేస్తే జీవితంలో ప్రతికూల ప్రభావాన్ని చూడాల్సి వస్తుంది.