శనీశ్వరుడిని న్యాయదేవుడిగా అలాగే కర్మదాతగా పిలుస్తూ ఉంటారు. అంటే మనం చేసే మంచి చెడులను బట్టి శుభ అశుభ ఫలితాలను అందిస్తూ ఉంటారు శనీశ్వరుడు. మంచి పనులు చేసే వారికి ఎల్లప్పుడూ ఆయన అనుగ్రహం ఉంటుంది. ఇక చెడ్డ పనులు చేసే వారిపై ఆయన ఆగ్రహిస్తూ ఉంటాడు. అయితే ఒక్కసారి శనీశ్వరుడు అనుగ్రహం కలిగింది అంటే ఇలాంటి బీదవాడైనా సరే కోటీశ్వరుడు అవ్వాల్సిందే. అలాగే ఆయన ఆగ్రహిస్తే ఎలాంటి కోటీశ్వరుడు అయిన బిచ్చగాడు అవ్వాల్సిందే.
ఇకపోతే చాలామంది శని దేవుడికి సంబంధించి అనేక రకాల దోషాలతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వాటిలో శని గ్రహ దోష నివారణ కూడా ఒకటి. చాలామంది ఈ శని గ్రహ దోషంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. శనివారం రోజు శనీశ్వరుడికి అంకితం చేయబడింది. కాబట్టి ఈ రోజున స్వామిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించడం ఆరాధించడం లాంటివి చేయడం వల్ల ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇక ఆయన అనుగ్రహం కోసం రావి చెట్టును పూజించడం మంచిదని చెబుతున్నారు.
శనివారం రోజు సాయంకాలం సమయంలో రావి చెట్టును పూజించడం రావి చెట్టు కింద దీపాలను వెలిగించడం వల్ల శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుందట. శనివారం రోజు రావి చెట్టుకు నీటిని సమర్పించి సాయంత్రం సమయంలో ఆవ నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల శనీశ్వరుడు సంతోషిస్తాడట. అలా పూజలు చేసే వారిని తప్పకుండా అనుగ్రహిస్తాడని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా శనివారం రోజున ఆయనకు ఇష్టమైన నీలిరంగు పుష్పాలను సమర్పించడం వల్ల కూడా ఆయన అనుగ్రహం కలుగుతుందట.