ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. అనారోగ్య సమస్యలతో,ఆర్థిక సమస్యలతో,పెళ్లి కాలేదని, పిల్లలు కలగలేదని ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. అయితే అలాంటప్పుడు కొన్ని రకాల పరిహారాలు పాటించాలి అంటున్నారు పండితులు. మరి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారాలు అన్నీ కూడా ఆంజనేయ స్వామి వద్ద చేయాలని గుర్తుంచుకోవాలి.
మీరు తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఆంజనేయ స్వామికి ఆవు నూనెతో దీపారాధన చేయడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుందట. అలాగే ఉపద్రవాలు ఆటంకాలు తొలగిపోవడానికి గోధుమలు,తెల్ల నువ్వులు, మినుములు, పెసలు బియ్యం ఈ ఐదింటిని పిండిలా చేసి ప్రమిదగా మార్చి అందులో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం వల్ల మీ పనిలో ఆటంకాలు తొలగి పనులు విజయవంతం అవుతాయి. అలాగే పెళ్లి చూపుల్లో ఆకర్షణ ఏర్పడి వివాహం కావాలి అనుకున్న వారు బియ్యపు పిండిని ప్రమిదగా చేసి ఆంజనేయ స్వామి ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.
అలాగే శని దేవుడి వల్ల వచ్చే దోషాలు, తీవ్రమైన కష్టాలు, గాలిధూళి దోషాలు తొలగడానికి నల్ల నువ్వుల పిండితో ప్రమిద చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఇలా చేయటం వల్ల హనుమంతుడి అనుగ్రహంతో ఆ దోషాలు కష్టాలు తొలగిపోతాయి. అదేవిధంగా మీ కోరికలు నెరవేరాలి అంటే బియ్యపు పిండి, గోధుమ పిండి సమానంగా తీసుకొని ప్రమిదలా చేసి దీపారాధన చేయాలి. అలాగే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అంటే హనుమంతుని ముందు కందిపిండి బెల్లంతో చేసిన ప్రమిదలో దీపారాధన చేయాలి.
దృష్టి దోషాలు పోయి, శత్రువుల మీద విజయం సాధించడానికి పొట్టు తీయని మినుముల పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం అయ్యేందుకు ఏలకులు, లవంగాలు, పచ్చ కర్పూరం, కస్తూరి, నువ్వుల నూనెలో కలిపి, దాంతో దీపారాధన చేయాలి. అయితే ఇప్పుడు చెప్పిన ఈ పరిహారాలు ఏదైనా కూడా ఆంజనేయస్వామికి దాదాపు 41 రోజులపాటు నియమంగా చేయాలి. ఒకవేళ స్త్రీలకు మధ్యలో ఆటంకం ఏర్పడినా కూడా ఆ తరువాత అలాగే 41 రోజులపాటు చేయడం వల్ల హనుమంతుడి అనుగ్రహం కలిగి మీరు ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు.