Bathukamma 2023 : బతుకమ్మలో పేర్చే పూలలో ఎన్ని ఔషధగుణాలు ఉంటాయో తెలుసా?

బతుకమ్మలో పేర్చే పూలకు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.

  • Written By:
  • Publish Date - October 15, 2023 / 07:00 PM IST

తెలంగాణలో(Telangana) అతిపెద్ద పండగ, మహిళల పండగ, పూల పండగ బతుకమ్మ(Bathukamma). ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు పూలతో పేర్చిన బతుకమ్మలతో, తొమ్మిది రకాల నైవేద్యాలు సమర్పించి జరుపుకుంటారు. అయితే ఈ బతుకమ్మలో పేర్చే పూలకు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వాటి వాసన పీల్చడం ఆ పూలని బతుకమ్మలా పేర్చే సమయంలో వాటితో పనిచేయడం, బతుకమ్మ ఆడాక వాటిని నీళ్ళల్లో కలపడం వల్ల ఆ నీళ్ళల్లో వాటి ఔషధగుణాలు కలవడంతో మనకు అందుతాయి. అలాగే వీటిల్లో కొన్ని పూలని ఆయుర్వేదంలో కూడా వాడతారు.

బతుకమ్మలో ముందుగా పేర్చేవి తంగేడు పూలు ఈ పూలు పసుపు రంగులో ఉంటాయి ఇవి మలబద్దకానికి, జ్వరానికి ఔషధంలాగా పనిచేస్తాయి. తంగేడు పూలు తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు పూలు తెలంగాణలో ఎక్కువగా దొరుకుతాయి.

తామరపువ్వులు లక్ష్మీదేవి నివాసం తామర పూలు చర్మ సంబంధ వ్యాధులను నివారిస్తాయి. కళ్ళు ఎర్రగా మారినట్లైతే తామర పూల రేకులను కళ్ళ మీద ఉంచితే ఎరుపుదనం తగ్గుతుంది. తామర పూలు, కలువ పువ్వులు, కుంకుమ పువ్వును కలిపి ముఖానికి రాసుకుంటే మన ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

గునుగు పువ్వు గడ్డి జాతికి చెందిన పువ్వు ఈ పూలు చాలా రకాల రంగులలో ఉంటాయి ఇవి మొక్కజొన్న పొత్తుల వలె ఉంటాయి. ఇవి వర్షాకాలపు చివరి రోజుల్లో, శీతాకాలపు తొలి రోజుల్లో వికసిస్తాయి. చర్మంపైన అయిన గాయాలు, పొక్కులు, క్షయవ్యాధి వంటివి తగ్గించడానికి వాడతారు.

గుమ్మడి పువ్వు అన్నింటికంటే ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. గుమ్మడిపువ్వును గౌరీ దేవిగా పూజిస్తారు. కాళ్ళ నొప్పులను తగ్గించడానికి గుమ్మడిపువ్వును వాడతారు.

కట్ల పువ్వు నీలి రంగులో ఉంటుంది ఇది డయాబెటిస్, క్యాన్సర్ ను తగ్గించే గుణాలను కలిగి ఉంది.

ఈ కాలంలో పూచే బంతి, చామంతి, సోంపు, గులాబీ పూలను కూడా బతుకమ్మలో వాడతారు. బంతి, చామంతి పూలు దోమల నివారణకు ఉపయోగపడతాయి.

బొగడబంతి పూలను బతుకమ్మలో ఉపయోగిస్తారు. బొగడబంతి పూల నుండి బీటాసైనిన్ లను సేకరించి వాటిని క్యాన్సర్ నివారణ మందులలో వాడతారు.

సీతజడ పూలు వీటిని సీతజడ గంటలు అంటారు. వీటిని కూడా బతుకమ్మలో ఉపయోగిస్తారు. బతుకమ్మలో వాడే పూలన్నీ కూడా ఇలా పండగకు మాత్రమే కాక ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి.

 

Also Read : Bathukamma 2023 : బతుకమ్మ పండుగను ఎలా జరుపుకుంటారు.. ఏ రోజు ఏం నైవేద్యం పెడతారు?