Ganesh Chaturthi 2024 – Flood Situation Dampens Ganesh Chaturthi Spirits in Vijayawada : మరికొద్ది గంటల్లో ప్రతి గల్లీలో గణనాథుల నవరాత్రి ఉత్సవాలు (GANESH Navratri ) మొదలుకాబోతున్నాయి. దేశ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయనే సంగతి తెలిసిందే. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి (Ganesh Chaturti ). ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈ పండగను అంగరంగ వైభవంగా ప్రజలు జరుపుకొంటారు.
భారీ వర్షాలు, వరదలు కారణంగా గణేష్ నవరాత్రుల (Ganesh Chaturthi) సందడే లేదు
ఈ సంవత్సరం కూడా అలాగే గణేష్ నవరాత్రులను సంతోషంగా జరుపుకోవాలని సిద్ధం అయ్యారు. అయితే విజయవాడ లో మాత్రం చవితి సంబరాలు ఎక్కడ కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం..రీసెంట్ గా విజయవాడ (Vijayawada ) లో కురిసిన భారీ వర్షాలే. గతంలో ఎన్నడూ లేని విధంగా గత శుక్రవారం – శనివారం మధ్య దాదాపు 29 సెం మీ వర్షం కురిసింది. ముఖ్యంగా కృష్ణమ్మ, బుడమేరు వరదల(Vijayawada Flood)కు విజయవాడ వన్‌టౌన్ ప్రాంతం అతలాకుతలం కావడంతో ఆ ప్రాంతంలో ఏటా కనిపించే వినాయక చవితి కోలాహలం ఇప్పుడు కనిపించకుండా పోయింది. ఇంకా వరద ముంపులోనే ఆ ప్రాంతాలు కొనసాగుతుండడం విద్యుత్తు సరఫరా లేకపోవడం, ఇళ్లు అపరిశుభ్రంగా ఉంటోన్న తరుణంలో విఘ్నవినాశకా తమ అవస్థలు తీర్చాలని వేడుకుంటున్నారు.
అప్పు చేసి మరీ వినాయక ప్రతిమల విక్రయ దుకాణాలు పెట్టాం
భారీ వర్షాలు, వరదల దెబ్బకు పంటలు నష్టపోవడంతో పండ్లు, పూల ధరలకు రెక్కలు ఎక్కాయి. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ తమకు ఇలాంటి ఆపదలు రాకుండా కాపాడాలంటూ గణపతిని తమకు తోచిన రీతిలో నమస్కరించుకోవాలని బెజవాడ వాసులు భావిస్తున్నారు. ఏటా వినాయక విగ్రహాలు, పండ్లు, పూలు, పత్రిల కొనుగోలుతో సందడిగా ఉండే మార్కెట్, ప్రధాన రహదారులు వరదల వల్ల బోసిపోయి కనిపిస్తున్నాయి. పూలు, పండ్లు దుకాణాల వద్ద ఓ మోస్తరు రద్దీ ఉంటోంది. అప్పు చేసి మరీ వినాయక ప్రతిమల విక్రయ దుకాణాలు పెట్టిన వారంతా తమకు ఆదాయం ఎంతవరకు వస్తుందనే అనుమానం , ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Central Govt Releases Rs. 3300 Cr : కేంద్రం నుంచి ఎలాంటి సాయం రాలేదు – CM చంద్రబాబు