Five Spices Spl: వాస్తు ప్రకారం ఇంట్లో ఐదు సుగంద ద్రవ్యాలు ఉండాల్సిందే.. అవి ఏంటంటే?

హిందువులు పురాతన కాలం నుంచే వాస్తు శాస్త్రాన్ని నమ్ముతూ వస్తున్నారు. అయితే రాను రాను టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత చాలామంది వాస్తు శాస్త్రాన్ని నమ్మడమే మానేశారు. కొంతమంది ఈ వాస్తు శాస్త్రాన్ని నమ్ముతూనే ఉన్నారు.

  • Written By:
  • Publish Date - September 21, 2022 / 08:45 AM IST

హిందువులు పురాతన కాలం నుంచే వాస్తు శాస్త్రాన్ని నమ్ముతూ వస్తున్నారు. అయితే రాను రాను టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత చాలామంది వాస్తు శాస్త్రాన్ని నమ్మడమే మానేశారు. కొంతమంది ఈ వాస్తు శాస్త్రాన్ని నమ్ముతూనే ఉన్నారు. ఇంట్లో ఏ పని చేసినా ఎటువంటి పని మొదలుపెట్టినా కూడా వాస్తు శాస్త్ర ప్రకారమే ఉండాలి అనుకున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా వాస్తు శాస్త్ర ప్రకారం మన వంటింట్లో కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు తప్పనిసరిగా ఉండాలని అలా ఉంటే చాలా మంచిది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో ఎటువంటి రకాల సుగంధ ద్రవ్యాలు ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అందులో మొదటిది అల్లం. మన వంటింట్లో అల్లం తప్పనిసరిగా ఉండాలి. ఈ అల్లాన్నీ అనేక రకాల కూరల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో చాలామంది అల్లం కీ బదులుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటూ మార్కెట్లో దొరికే వాటిని ఉపయోగిస్తున్నారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదు అని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇక మన వంట గదిలో ఉండవలసిన మరొక సుగంధ ద్రవ్యం ధనియాలు. ధనియాలను అనేక రకాల ఆహార చేర్చుకుని తినడం వల్ల రుచి వస్తుంది. ధనియాలు ఆహారానికి మంచి టేస్ట్ ను ఇవ్వడమే కాదు మనసును, శరీరాన్ని కూడా ఆనందపరుస్తాయి. మనలో ఉండే జీర్ణక్రియ, శ్వాస, మూత్ర సంబంధ వ్యాధులను ధనియాలు దూరం చేస్తాయి. ధనియాలు వంట గదిలో ఉండడం వాస్తు శాస్త్రం ప్రకారం తప్పనిసరి. ఇవి వంట గదిలో ఉంటే అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు మనకు కలుగుతాయని పెద్దల నమ్మకం.

వాస్తు శాస్త్ర ప్రకారం వంటింట్లో ఉండవలసిన మరొక సుగంధ ద్రవ్యం జీలకర్ర. వీటిని పోపు దినుసులుగా వంటకాల్లో ఉపయోగిస్తారు. జీలకర్ర వాసన మంచిగా రావడంతో పాటు టేస్ట్ కూడా అద్భుతంగా ఉండి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.. జీలకర్ర వల్ల జీర్ణ క్రియ మెరుగ్గా పనిచేస్తుంది. అలాగే శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. అలాగే వంటింట్లో ఉండవలసిన మరొక సుగంధ ద్రవ్యం మెంతులు. వీటిని కూరల్లో మాత్రమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది శ్వాస, జీర్ణ క్రియ వంటి సమస్యలను దూరం చేస్తుంది. రాత్రంతా మెంతులు నానబెట్టి వచ్చిన నీటిని ఉదయం పూట తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేయడం వలన మనలో ఉన్న షుగర్ లెవల్స్ తగ్గుతాయి. మెంతులను మన కూరల్లో పొడిగా చేసి వాడతారు.

ఇకవాస్తు శాస్త్ర ప్రకారం మన వంటింట్లో ఉండవలసిన ఐదవ సుగంధద్రవ్యం పసుపు. హిందువులు ఏ శుభకార్యానికి అయినా ఈ పసుపును ముందుగా ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు. ఈ పసుపులో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు, ఇలాంటి ఇంప్లమెంటరీ, యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. అందుకే ఎల్లప్పుడూ వంట గదిలో పసుపు ఉండాలి. పసుపును వాడడం వలన శరీరంలోని చెడు కొవ్వు పూర్తిగా కరిగిపోతుంది. కావున పసుపును వంటగదిలో అయిపోకుండా చూసుకోవాలని వాస్తు పండితులతో పాటు అనేక మంది వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు.